ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు ఒక ప్రైవేట్‌ స్కూల్లో చదివాను. ప్రస్తుతం ఆ పాఠశాల లేదు. ఆ కాలానికి సంబంధించి స్టడీ సర్టిఫికెట్‌ను పొందడం ఎలా?

Published : 06 Jul 2022 01:35 IST

నేను ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు ఒక ప్రైవేట్‌ స్కూల్లో చదివాను. ప్రస్తుతం ఆ పాఠశాల లేదు. ఆ కాలానికి సంబంధించి స్టడీ సర్టిఫికెట్‌ను పొందడం ఎలా?

- లవకుమార్‌

జ: మీరు సంబంధిత తహసీల్దారు కార్యాలయాన్ని సంప్రదించి నివాస ధ్రువీకరణ పత్రాన్ని పొందవచ్చు.


నేను గ్రూప్‌-1 కి దరఖాస్తు చేసినప్పుడు ఏ సర్టిఫికెట్లనూ అప్‌లోడ్‌ చేయలేదు. వెరిఫికేషన్‌ సమయంలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లను చూపిస్తే సరిపోతుందా?

- ఉమా మహేశ్‌

జ: మీరు దరఖాస్తు చేసినప్పుడు ఏ సర్టిఫికెట్లనూ అప్‌లోడ్‌ చేయకపోయినా పర్వాలేదు. కానీ వెరిఫికేషన్‌ సమయంలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లను చూపించాల్సి ఉంటుంది.


నేను ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఆంధ్రప్రదేశ్‌లో; పదో తరగతి నుంచి డిగ్రీ వరకు హైదరాబాద్‌లో చదివాను. ఏ రాష్ట్రంలో స్థానికతను పొందుతాను?

- యేసుబాబు

జ: మీకు ఆంధ్రప్రదేశ్‌ స్థానికత వర్తిస్తుంది.


నా పేరు పదోతరగతి మెమోలో k.Achutarao అని, ఇంటర్‌, డిగ్రీలో k.Achutharao అని ఉంది. టీఎస్‌పీఎస్సీ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయంలో ఏదైనా సమస్య అవుతుందా?

- కె.అచ్యుతరావు

జ: ఏ సమస్య ఉండదు. టెన్త్‌ ఆధారంగా మిగతా సర్టిఫికెట్లలోనూ పేరు సరిచేసుకుంటే మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని