ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

మా స్వస్థలం తెలంగాణ. కానీ ఒకటి నుంచి ఏడో తరగతి వరకు మహారాష్ట్రలో చదివాను. నాకు తెలంగాణ స్థానికత వర్తిస్తుందా?

Published : 27 Jul 2022 02:21 IST

మా స్వస్థలం తెలంగాణ. కానీ ఒకటి నుంచి ఏడో తరగతి వరకు మహారాష్ట్రలో చదివాను. నాకు తెలంగాణ స్థానికత వర్తిస్తుందా?

- పిన్నోజి సతీష్‌

జ: మీ ప్రాథమిక విద్యాభ్యాసమంతా మరొక రాష్ట్రంలో జరిగిన కారణంగా మీకు తెలంగాణ స్థానికత వర్తించదు.


నేను ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను. నా చేతిపై 6 సెం.మీ. పొడవున పచ్చబొట్టు ఉంది. దీని వల్ల ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల సాధనలో ఏదైనా ఇబ్బంది అవుతుందా? మెడికల్‌ టెస్ట్‌లో ఏమైనా సమస్య ఉంటుందా?

- ప్రియాంక

జ: ఎలాంటి సమస్యా ఉండదు. ఏ సందేహాలు పెట్టుకోకుండా పరీక్షలకు బాగా ప్రిపేర్‌ అవ్వండి.


నేను ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు వరంగల్‌, అయిదు నుంచి ఏడో తరగతి వరకు కరీంనగర్‌లో చదివాను. తర్వాత ఎనిమిది చదవకుండా తొమ్మిది, పది వరంగల్‌లో పూర్తి చేశాను. ఎనిమిదో తరగతికి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్‌ను ఎలా పొందాలి?

- రమేష్‌

జ: మీరు వరంగల్‌లో స్థానికతను పొందుతారు. ఎనిమిదో తరగతి చదవలేదు కాబట్టి స్టడీ సర్టిఫికెట్‌కు బదులు ఆ కాలానికి సంబంధించి తహసీల్దారు నుంచి నివాస ధ్రువీకరణ పత్రాన్ని పొందండి.

help@eenadupratibha.net


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని