కరెంట్‌ అఫైర్స్‌

భారత సైన్యంలోని రెండు రెజిమెంట్ల కోసం ఆకాష్‌ ఆయుధ వ్యవస్థ (తిజూళీ - ఆకాశ్‌ వెపన్‌ సిస్టం) తయారీ, సరఫరా కోసం ఏ సంస్థ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖతో రూ.8161 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది? 

Published : 27 May 2023 04:41 IST

మాదిరి ప్రశ్నలు

భారత సైన్యంలోని రెండు రెజిమెంట్ల కోసం ఆకాష్‌ ఆయుధ వ్యవస్థ (తిజూళీ - ఆకాశ్‌ వెపన్‌ సిస్టం) తయారీ, సరఫరా కోసం ఏ సంస్థ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖతో రూ.8161 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది?                              

జ: భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌)


కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన (ఎంఎన్‌ఆర్‌ఈ) మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం సోలార్‌ పార్కుల అత్యధిక స్థాపన సామర్థ్యంలో ఏ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో  నిలిచింది? (ఈ రాష్ట్రం 3,050 మెగావాట్ల వ్యవస్థాపిత సౌరశక్తి    సామర్థ్యాన్ని సాధించింది. రాష్ట్రంలో నాలుగు మెగా ఫంక్షనల్‌ సోలార్‌ పార్కులు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌,గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ ఉన్నాయి.) 

జ: ఆంధ్రప్రదేశ్‌


భారత్‌ 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు ఎంత మొత్తం విలువైన వస్తువులను ఎగుమతి చేసింది? (2021-22 సంవత్సరంతో పోలిస్తే ఇది 5.6 శాతం అధికం. భారత్‌ 2022-23లో రూ.58.71 లక్షల కోట్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. 2021-22తో పోలిస్తే ఇది 16.1 శాతం ఎక్కువ.)

జ: రూ.36.50 లక్షల కోట్లు


2022 నవంబరు నుంచి 2023 మార్చి మధ్య దేశంలో అత్యధికంగా ఏ రాష్ట్రంలో 871 భారీ కార్చిచ్చులు చోటు చేసుకున్నాయి? (ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఆంధ్రప్రదేశ్‌ (754), కర్ణాటక (642), తెలంగాణ (447) నిలిచాయి.) 

జ: ఒడిశా


పెద్ద మొత్తంలో పెట్టుబడి ప్రాజెక్టులను ఆకర్షించేందుకు  ఏ దేశం ‘గోల్డెన్‌ లైసెన్స్‌’ పేరిట ఓ కార్యాచరణను                 ప్రారంభించింది? 

జ: బహ్రెయిన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని