ప్రాక్టీస్‌ బిట్లు

నచికేతనుడి కథ కఠోపనిషత్తులో ఉంది. ఈ కథలో ఆ బాలుడు మరణం తర్వాత ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఎవరి వద్దకు వెళ్లాడు?

Published : 03 Jan 2024 00:18 IST

భారతదేశ చరిత్ర

1. నచికేతనుడి కథ కఠోపనిషత్తులో ఉంది. ఈ కథలో ఆ బాలుడు మరణం తర్వాత ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఎవరి వద్దకు వెళ్లాడు?

1) శివుడు 2) యముడు 3) ఇంద్రుడు 4) బ్రహ్మ

2. ఆత్మ లేదా బ్రహ్మను గురించి తెలుసుకోవడానికి ఏం చేయాలి?

1) దానాలు 2) అహింస విధానం
3) తపస్సు 4) దేవుడిని పూజించాలి

3. వేదకాలంలో ఒక మనిషి ఎన్ని గోవులకు సమానం?

1) 10     2) 100     3) 1000    4) 1

4. రుగ్వేదకాలంలో ఉన్న నాణేలు?

1) నిష్క  2) శతమానం  3) కృష్ణల  4) పైవన్నీ

5. కులవ్యవస్థ పటిష్ఠమైన కాలం?

1) మలివేద కాలం 2) తొలివేద కాలం
3) 1, 2 4) జనపదాల కాలం

6. రుగ్వేదంలోని శ్లోకాలు ప్రధానంగా దేని కోసం వివరిస్తున్నాయి?

1) పశువులు 2) మగ సంతానం
3) అశ్వాలు   4) పైవన్నీ

7. మలివేద కాలంలో రాజుకు సహాయ పడే అధికారులు?

1) పురోహితుడు 2) సేనాని
3) గ్రామణి 4) పైవారందరూ

8. మలివేద కాలంలో వర్తక శ్రేణులను ఏమని పిలిచేవారు?

1) నగరం   2) శ్రేణి   3) గణ  4) గణ పరిషత్‌

9. శూన్య వాదాన్ని ప్రతిపాదించినవారు?

1) అశ్వఘోషుడు 2) నాగార్జునుడు
3) సోమదేవసూరి 4) కొండ కుందాచార్య

10. వర్ధమాన మహావీరుడు ఒక-

1) బ్రాహ్మణుడు 2) క్షత్రియుడు
3) వైశ్యుడు 4) శూద్రుడు

11. బుద్ధుడు తొలి బోధన చేసిన ప్రదేశం?

1) కపిలవస్తు 2) సాంచి
3) సారనాథ్‌ 4) రాజగృహం

సమాధానాలు: 1-2; 2-3; 3-2; 4-4; 5-1; 6-4; 7-4; 8-3; 9-2; 10-2; 11-3.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని