ప్లాస్టిక్‌ కోర్సుల్లో ప్రవేశాలు

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) దేశవ్యాప్తంగా వివిధ

Published : 06 Jul 2021 10:58 IST

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) దేశవ్యాప్తంగా వివిధ డిప్లొమా కోర్సులు అందిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ సంస్థ నిర్వహించే ప్రవేశ పరీక్షతో కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. వీటిని పూర్తిచేసుకున్నవారు ప్లాస్టిక్, అనుబంధ పరిశ్రమలు, ప్లాస్టిక్‌ వినియోగ సంస్థల్లో మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ప్లాస్టిక్‌ స్పెషలైజేషన్‌తో బీటెక్‌ కూడా చదువుకోవచ్చు.

పారిశ్రామికోత్పత్తికి అవసరమైన సాంకేతిక నిపుణులను తయారు చేస్తూ మేకిన్‌ ఇండియాలో కీలక పాత్ర పోషిస్తూ సిపెట్‌ పేరు పొందింది. టెక్నికల్‌ కోర్సుల శిక్షణతో నిరుద్యోగ యువతను తమ కాళ్లపై నిలబడేలా చేస్తోంది. స్వల్ప, దీర్ఘకాలిక కోర్సులను అందిస్తూ మధ్యతరగతి విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంది. తాజాగా వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ప్రవేశ పరీక్ష: 100 మార్కులకు 2 గంటల వ్యవధిలో సిపెట్‌ అడ్మిషన్‌ టెస్టును ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. 
సిలబస్‌: పదో తరగతి సబ్జెక్టుల నుంచి జనరల్‌ నాలెడ్జ్, ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్‌లపై ప్రశ్నలుంటాయి. దరఖాస్తుకు చివరి తేదీ: జులై 20
సిపెట్‌ అడ్మిషన్‌ పరీక్ష తేదీ: జులై 29
తరగతులు ప్రారంభం: ఆగస్టు రెండోవారం
https:/cipet.onlineregistrationform.org/CIPET/

టెక్నికల్‌ కోర్సులకు డిమాండ్‌ 

కరోనా నేపథ్యంలో పీపీఈ కిట్లు, ఫేస్‌ మాస్క్‌లు, గ్లౌజులు, హ్యాండ్‌ శానిటైజర్లకు గిరాకీ పెరిగింది. ఇంకోపక్క స్వదేశీ వస్తువుల వాడకం పెరగడంతో ప్లాస్టిక్‌ ఆధారిత పరిశ్రమల్లో మిషన్‌ ఆపరేటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ప్లాస్టిక్‌ ఆధారిత పరిశ్రమల్లో యాభైవేల మంది నిపుణుల అవసరం ఉందని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే సరైన నైపుణ్యమున్న అభ్యర్థులు దొరకడం లేదు. సిపెట్‌లోని కోర్సులకు ఏఐసీటీఈ (ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌) గుర్తింపు ఉండడంతో దేశంలోని అన్ని ప్రముఖ కంపెనీలూ ఇక్కడి విద్యార్థులను ఉద్యోగాల్లో  నియమించుకుంటున్నాయి.
ప్లాస్టిక్‌ ఆధారిత పెట్రో కెమికల్స్‌ రంగం మనదేశంలో పుంజుకుంటోంది. ఆత్మ నిర్భర్‌ భారత్‌లో భాగంగా మనదేశ తయారీ రంగానికి ఊపు వచ్చింది. దీంతో ఈ కోర్సులను నేర్చుకున్నవారికి ఉద్యోగావకాశాలు పెరిగాయి. నంది, ఫినోలెక్స్, నీల్‌కమల్, అమర్‌రాజా, గోదావరి లాంటి ప్రముఖ ప్రైవేటు సంస్థలు ప్లాస్టిక్‌ రంగ ఇంజినీరింగ్‌ నిపుణులను నియమించుకుంటున్నాయి. 

   - సత్యనారాయణ, న్యూస్‌టుడే, చర్లపల్లి 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని