IBPS: గ్రామీణ బ్యాంకుల్లో 9000+ ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు

IBPS Job notification: గ్రామీణ బ్యాంకుల్లో 9వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు నేటితో ముగియడంతో ఐబీపీఎస్‌ ఆ గడువు పొడిగించింది.

Updated : 21 Jun 2023 20:01 IST

దిల్లీ: దేశంలోని గ్రామీణ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు నేటితో (జూన్‌ 21) ముగియడంతో రిక్రూట్‌మెంట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల గడువును వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. మణిపుర్‌లో హింసాత్మక ఘటనలు, పలుచోట్ల ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో అర్హులైన అభ్యర్థులు జూన్‌ 28వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకొనే అవకాశం ఏర్పడింది.

దేశవ్యాప్తంగా రీజినల్‌ రూరల్‌ బ్యాంకు (RRB)ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే నియామక పరీక్షకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌ (IBPS) భారీ నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XII (CRP)ల ద్వారా దేశవ్యాప్తంగా 9,053 ఉద్యోగాల భర్తీకి జూన్‌ 1 నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నారు. క్లర్క్‌, పీఓ, ఆఫీసర్స్‌ స్కేల్‌ II, III స్థాయి పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులను అర్హులుగా నిర్ణయించారు. ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 28 వరకు https://www.ibps.in/  వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని