Bank Jobs: IDBI బ్యాంకులో 600 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. దరఖాస్తులు షురూ!

Bank Jobs: ఐడీబీఐ బ్యాంకులో 600 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల కోసం దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలివే..

Updated : 15 Sep 2023 19:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డిగ్రీ పాసై బ్యాంకు ఉద్యోగాల(Bank Jobs) కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌! ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (IDBI) పెద్ద సంఖ్యలో జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ (గ్రేడ్‌ ఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  డిగ్రీ సహా పలు నైపుణ్యాల ప్రాతిపదికన మొత్తం 600 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అయితే, మ‌ణిపాల్ (బెంగ‌ళూరు), నిట్టే (గ్రేట‌ర్ నోయిడా) విద్యాసంస్థలతో క‌లిసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్‌) కోర్సు ద్వారా ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నట్టు IDBI నోటిఫికేషన్‌లో పేర్కొంది.  ఆసక్తికలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 15 నుంచి 30వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి

నోటిఫికేషన్‌లో ముఖ్యాంశాలివే..

  • అర్హత‌: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాల‌యం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత.
  • వయో పరిమితి: ఆగస్టు 31, 2023 నాటికి 21 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగులకు ప‌దేళ్లు చొప్పున వయసులో గ‌రిష్ఠ స‌డ‌లింపు ఉంటుంది. 
  • ఎంపిక ప్రక్రియ: అర్హులైన అభ్యర్థుల‌కు ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రతిభ క‌న‌బ‌ర్చిన అభ్యర్థులకు ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ, ధ్రువపత్రాల పరీశీలన, వైద్య పరీక్షల ఆధారంగా తుది ఎంపిక‌ ఉంటుంది.
  • ద‌ర‌ఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200, ఇతరులు రూ.1000 చెల్లించాలి. 
  • తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు: విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, చీరాల‌, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, క‌డ‌ప‌, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, తిరుప‌తి, విజ‌య‌న‌గ‌రం, హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌. 
  • శిక్షణ, ఫీజు: ఎంపికైన అభ్యర్థుల‌ను ఏడాదిపాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్‌) కోర్సులో శిక్షణ ఇస్తారు.  ఆ స‌మ‌యంలో అభ్యర్థులు కోర్సు ఫీజు కింద రూ.3,00,000 చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు నిర్దేశించిన విధంగా విడ‌త‌ల వారీగా ఫీజు క‌ట్టే వెసులుబాటు ఉంది. అర్హత కలిగిన అభ్యర్థుల‌కు ఐడీబీఐ బ్యాంకు విద్యారుణం సైతం మంజూరు చేస్తుంది. కోర్సులో చేరేట‌ప్పుడు అభ్యర్థులు మూడేళ్లు స‌ర్వీస్ బాండ్‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. 
  • వేతనం: ఎంపికైన అభ్యర్థుల‌కు శిక్షణ కాలంలో(6 నెల‌లు)లో నెల‌కు రూ.5000 ఇస్తారు. ఇంట‌ర్న్‌షిప్ (2 నెల‌లు) స‌మ‌యంలో నెల‌కు రూ.15 వేలు చెల్లిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ ధ్రువీకరణపత్రంతో పాటు జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్ (గ్రేడ్‌-ఓ) పోస్టుకు భర్తీ చేస్తారు. ఉద్యోగంలో చేరిన‌వారికి రూ.6.14లక్షల నుంచి రూ.6.50 లక్షల వ‌ర‌కు వార్షిక వేతనం అందుతుంది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని