NTA: జేఈఈ, నీట్‌ పరీక్ష తేదీలొచ్చేశాయ్‌..! క్యాలెండర్‌ ప్రకటించిన ఎన్‌టీఏ

Examination Calender: వచ్చే విద్యా సంవత్సరానికి జేఈఈ, నీట్‌ వంటి పరీక్షల తేదీలను ఎన్‌టీఏ తాజాగా ప్రకటించింది. ఏయే పరీక్షలు ఏయే తేదీల్లో జరగనున్నాయో తెలుసుకోండి..!

Updated : 19 Sep 2023 13:16 IST

దిల్లీ: 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు ప్రవేశ పరీక్షల వార్షిక క్యాలెండర్‌ (Examination Calender)ను జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. నీట్‌ (NEET), జేఈఈ (JEET), సీయూఈటీ, నెట్‌ వంటి పరీక్షల తేదీలను వెల్లడించింది.

పరీక్షల తేదీలు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి..

  • వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య జేఈఈ మెయిన్ (JEE Main) మొదటి విడత (Session 1) పరీక్షలు జరగనున్నాయి. ఇది కంప్యూటర్‌ ఆధారిత విధానంలో జరిగే పరీక్ష.
  • ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య జేఈఈ మెయిన్ రెండో విడత (JEE Main Session 2) పరీక్షలు జరగనున్నాయి
  • మే 5, 2024వ తేదీన దేశవ్యాప్తంగా నీట్‌ యూజీ (NEET UG) పరీక్ష జరగనుంది. ఇది పెన్ను పేపర్‌/ఓఎంఆర్‌ విధానంలో జరుగుతుంది.
  • మే 15 నుంచి 31 మధ్య యూనివర్సిటీల యూజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CUET - UG) జరగనుంది. ఇది కూడా కంప్యూటర్‌ ఆధారిత విధానంలో జరిగే పరీక్ష.
  • మార్చి 11 నుంచి 28 మధ్య యూనివర్సిటీల పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CUET - PG) జరగనుంది.
  • జూన్ 10 నుంచి 21 మధ్య మొదటి విడత యూజీసీ నెట్‌ (UGC NET) పరీక్ష జరగనుంది. ఇది కూడా కంప్యూటర్‌ ఆధారిత టెస్టు.

పరీక్షలకు సంబంధించిన మరింత సమాచారం అభ్యర్థులకు రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన సమయంలో వెల్లడిస్తామని ఎన్‌టీఏ (NTA) ఈ సందర్భంగా తెలిపింది. కంప్యూటర్‌ ఆధారంగా జరిగే పరీక్షల ఫలితాలను.. పరీక్షలు జరిగిన మూడు వారాల్లోపు ప్రకటిస్తామని పేర్కొంది. ఇక, నీట్‌ యూజీ 2024 పరీక్ష ఫలితాలను వచ్చే ఏడాది జూన్‌ రెండో వారంలో ప్రకటించనున్నట్లు వెల్లడించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని