కరెంట్‌అఫైర్స్‌

2024, ఫిబ్రవరి 22న అహ్మదాబాద్‌లో గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్‌) ఎన్నో వార్షికోత్సవాన్ని నిర్వహించారు?

Updated : 28 Apr 2024 00:37 IST

మాదిరి ప్రశ్నలు

2024, ఫిబ్రవరి 22న అహ్మదాబాద్‌లో గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్‌) ఎన్నో వార్షికోత్సవాన్ని నిర్వహించారు? (అమూల్‌ కంపెనీని నిర్వహిస్తున్న జీసీఎంఎంఎఫ్‌ ప్రస్తుతం ప్రపంచంలో 8వ అతిపెద్ద డెయిరీ కంపెనీగా స్థానం దక్కించుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి.)

జ: 50వ


బీబీసీ నూతన ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రవాస భారతీయుడు ఎవరు? (2024, మార్చి 4 నుంచి నాలుగేళ్ల పాటు ఈయన పదవిలో కొనసాగుతారు. భారత్‌లోని ఔరంగాబాద్‌లో జన్మించిన ఈయన 1960లో బ్రిటన్‌కు వలస వెళ్లారు. బ్రిటన్‌ టెలివిజన్‌ రంగానికి చేసిన విశేష కృషికి 2019లో అప్పటి బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 ఈయన్ను ‘కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌’ పురస్కారంతో సత్కరించారు.)

జ: డాక్టర సమీర్‌ షా


రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధానికి ఏ రోజుతో రెండేళ్లు పూర్తయ్యాయి? (తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌లో రష్యన్‌ భాష మాట్లాడేవారిపై ఉక్రెయిన్‌ ప్రభుత్వం 2014 నుంచి మారణకాండకు పాల్పడుతుందని ఆరోపిస్తూ 2022లో ఇదే రోజున ‘ప్రత్యేక మిలటరీ ఆపరేషన్‌’ పేరుతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ యుద్ధాన్ని ప్రారంభించారు. డాన్‌బాస్‌ విమోచనం, నాజీయిజం నిర్మూలన లాంటివి తమ లక్ష్యాలని ఆయన ప్రకటించారు. ఐఎంఎఫ్‌ 15.6 బి.డాలర్ల ఆర్థికసాయాన్ని ఉక్రెయిన్‌కు అందించింది. యుద్ధంలో ఉన్న ఓ దేశానికి ఆర్థికసాయం అందించడం ఐఎంఎఫ్‌ చరిత్రలోనే ఇది తొలిసారి.)

జ: 2024, ఫిబ్రవరి 24


Current Affairs

Former wrestler Narsingh Pancham Yadav was elected Chairman of the Wrestling Federation of India's (WFI) Athletes' Commission.
F The other elected members of the Athletes Commission are Sahil (Delhi), Smitha AS (Kerala), Bharti Bhaghei (UP), Khushboo 
S Pawar (Gujarat), Nikki (Haryana), and Sweta Dubey (Bengal).


Amitabh Chaudhry was reappointed as MD & CEO of the Axis Bank for three years on 25 April 2024. His tenure will be effective from January 1, 2025. Chaudhry joined Axis Bank as its MD and CEO in January 2019.


The Indian Historical Records Commission (IHRC) has adopted a new logo and motto on 25 Apil 2024. These were selected from the 436 entries received in the online competition organised by the IHRC on MyGov portal. The winning logo and motto of the IHRC were designed by Shaurya Pratap Singh of Delhi.


The World Intellectual Property Day is observed every year on April 26.  
2024 theme: “IP and the SDGs: Building Our Common Future with Innovation and Creativity”.

For more Current Affairs: Scan QR code


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని