TS EAMCET: టీఎస్‌ ఎంసెట్‌ పేరు మార్పు.. 8 ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలివే..

తెలంగాణలో ఎంసెట్‌ పేరు మారుస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీచేసింది. ఎనిమిది ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేసింది.

Updated : 25 Jan 2024 20:14 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఎంసెట్‌ పేరు మారింది. టీఎస్‌ ఎంసెట్‌ పేరును టీఎస్‌ ఈఏపీసెట్‌ (TS EAPCET 2024)గా మారుస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TS EAPCET)సహా ఎనిమిది ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేశారు. 2024- 25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల తేదీలు.. నిర్వహించే యూనివర్సిటీల వివరాలివే..

  • తెలంగాణ ఈసెట్‌ - మే 6 - ఉస్మానియా యూనివర్సిటీ
  • టీఎస్‌ ఈఏపీసెట్‌ (ఇంజినీరింగ్‌)- మే 9 నుంచి 11 వరకు; (అగ్రికల్చరల్‌ అండ్‌ ఫార్మా) మే 12, 13 - జేఎన్‌టీయూహెచ్‌
  • టీఎస్‌ ఎడ్‌సెట్‌ - మే 23 - మహాత్మాగాంధీ యూనివర్సిటీ
  • టీఎస్‌ లా సెట్‌; పీజీఎల్‌సెట్‌ - జూన్‌ 3 - ఉస్మానియా యూనివర్సిటీ
  • టీఎస్‌ ఐసెట్‌ - జూన్‌ 4, 5 - కాకతీయ యూనివర్సిటీ
  • టీఎస్‌ పీజీఈసెట్‌ జూన్‌ 6 నుంచి 8వరకు - జేఎన్‌టీయూహెచ్‌
  • టీఎస్‌ పీఈసెట్‌ - జూన్‌ 10 నుంచి 13 వరకు - శాతవాహన యూనివర్సిటీ

ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు, షెడ్యూల్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజు తదితర వివరాలను సంబంధిత పరీక్షల కన్వీనర్లు వెల్లడిస్తారని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్‌.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని