TSRJC CET 2024: ‘పది’ విద్యార్థులకు గమనిక.. టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌కు దరఖాస్తులు షురూ

టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. 

Published : 31 Jan 2024 19:33 IST

TSRJC CET 2024 | హైదరాబాద్‌: పదో తరగతి విద్యార్థులకు గమనిక.. తెలంగాణలోని గురుకుల రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశ పరీక్ష (TSRJC CET 2024)కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35 గురుకుల జూనియర్‌ కళాశాలలు  (15 బాలురు, 20 బాలికల కాలేజీలు) ఉండగా..  వీటిలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో సీట్ల భర్తీకి ఏప్రిల్‌ 21న పరీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం పదోతరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు జనవరి 31 నుంచి మార్చి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం రూ.200. ఈ పరీక్షలో విద్యార్థుల ప్రతిభ, రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. TSRJC CET 2024 పరీక్ష ఏప్రిల్‌ 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనుంది. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సీట్ల కేటాయింపునకు తొలి కౌన్సెలింగ్‌ మే నెలలో నిర్వహించే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఈ కింది పీడీఎఫ్‌లో చూడొచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని