సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ....

Updated : 20 Aug 2021 01:10 IST

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ,

3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

జవాబు


చెప్పుకోండి చూద్దాం!

ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఖాళీల్లో ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం.


పదమేది?

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి..

కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


వాక్యాల్లో వ్యక్తుల పేర్లు

ఇక్కడున్న వాక్యాల్లో కొన్ని పేర్లు దాగి ఉన్నాయి. జాగ్రత్తగా చదివితే కనిపిస్తాయి. ఓ సారి ప్రయత్నించి చూడండి.

1. అరె.. జాగ్రత్త.. అది అసలే గాజు గ్లాసు.. ధర ఎంతో తెలుసా దానిది!  
2. ఇంతకు మించి ఇంకేం చెప్పలేనిక.. రుణ పడి మాత్రం ఉంటాను జీవితాంతం నీకు.
3. నువ్వు చెప్పకున్నా.. నాకన్నీ తెలుసు.. మనవాళ్లు ఎవరో పరాయివాళ్లు ఎవరో!
4. ఎందుకలా ఉండిపోతావు వెనకాల.. తలా ఒక చేయి వేస్తేనే కదా పని త్వరగా పూర్తయ్యేది.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


క్విజ్‌.. క్విజ్‌..

1. మోనాలిసా చిత్రాన్ని గీసింది ఎవరు?
2. మనిషి మెదడు బరువు ఎంత ఉంటుంది?
3. సాలీళ్ల రక్తం ఏ రంగులో ఉంటుంది?
4. 2012 ఒలింపిక్స్‌ ఏ దేశంలో జరిగాయి?
5. ఒక సంవత్సరంలో ఎన్ని వారాలుంటాయి?


నేను ఎవర్ని?

నేనో నాలుగు అక్షరాల పదాన్ని. దొంగలో ఉన్నాను.. బెంగలో లేను. తొండలో ఉన్నాను. తొండంలో లేను.

కాలులో ఉన్నాను. కీలులో లేను. మాయలో ఉన్నాను. మామలో లేను. ఇంతకీ నేను ఎవర్ని?


ఎలానో తెలుసా?

చింటూ దగ్గర వంద రూపాయలున్నాయి. వాటితో చాక్లెట్లు, బిస్కెట్లు కలిపి వంద కొన్నాడు. ఒక్క బిస్కెట్‌ 3 రూపాయలు.

చాక్లెట్టేమో అర్ధరూపాయి. వంద రూపాయలకు వంద వస్తువులను కొనడం చింటూకు ఎలా సాధ్యమైంది. మీకేమైనా తెలుసా?


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

EGG, PUPA, LARVA, HOST, BUTTERFLY, CATERPILLER,
FOOD, WINGS,POND, INSECTS, MYMPH, ADULT


నేను గీసిన బొమ్మ!


జవాబులు

చెప్పుకోండి చూద్దాం: 1.మెరుపుల 2.లేచే 3.సోమరి 4.మద్దతు 5.ఎంత పదమేది: శిగీళిశిలిని  వాక్యాల్లో వ్యక్తుల పేర్లు: 1.సుధ 2.కరుణ 3 సుమ 4.లత
అది ఏది?: 2

క్విజ్‌.. క్విజ్‌.. : 1.లియోనార్డో డావిన్సీ 2.సుమారు 1.360 కిలోగ్రాములు 3.నీలి రంగులో.. 4.ఇంగ్లాండ్‌ 5.52 వారాలు
నేను ఎవర్ని?: దొండకాయ
ఎలానో తెలుసా?: 20 బిస్కెట్లు, 80 చాక్లెట్లు ఇచ్చాడు (20 బిస్కెట్లు 60 రూపాయలు, 80 చాక్లెట్లు 40 రూపాయలు. వంద రూపాయలకు వంద వస్తువులు)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని