రోజుకో పద్యం

గంగపాఱు నెపుడుఁ గదలని గతితోడమురికివాగు పాఱు మ్రోతతోడపెద్ద పిన్నతనము పేర్మియీలాగురా!విశ్వదాభిరామ వినురవేమ!

Published : 24 May 2020 00:37 IST

గంగపాఱు నెపుడుఁ గదలని గతితోడ
మురికివాగు పాఱు మ్రోతతోడ
పెద్ద పిన్నతనము పేర్మియీలాగురా!
విశ్వదాభిరామ వినురవేమ!

అంటే.. పవిత్రమైన గంగానది ఎప్పుడూ ప్రశాంతంగా.. నిశ్శబ్దంగా ప్రవహిస్తూ ఉంటుంది. మురికి కాలువ మాత్రం గలగల శబ్దం చేస్తూ పారుతుంది. గొప్పవారు గంగవంటివారు. ప్రశాంతంగా ఉంటారు. నీచులు మురికి కాలువలాంటివారు. గలగల మాట్లాడుతూ లేని గొప్పలు చెప్పుకొంటూ ఉంటారు.


1. రమ్మనడానికి పొమ్మనడానికి ఒకే పిలుపు. ఏమిటది?
2. కొన్నప్పుడు నల్లగా ఉంటుంది. వాడితే ఎర్రగా అవుతుంది. చివరికి తెల్లగా మారుతుంది?


పదమేది?

ఇక్కడ ఓ పదంలోని అక్షరాలు దారి తప్పిపోయాయి. సరైన దారి నుంచి తీసుకెళ్లి వాటిని కిందున్న గడుల్లో రాస్తే పదం కనిపిస్తుంది. మరదేంటో కనిపెడతారా?


I, MAN, AM REGAL - A GERMAN AM I
NEVER ODD OR EVEN
MADAM, I'M ADAM


ఏది ఎక్కడ?

ఇక్కడున్న బొమ్మలో కొన్ని భాగాలు లేవు. అవి కింద ఉన్నాయి. వాటికి అంకెలూ ఉన్నాయి. వీటి ఆధారంగా బొమ్మలో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో సరైన అంకెలు వేయండి.




జవాబులు:

పొడుపు కథలు: 1. వెళ్లిరండి (దయచేయండి), 2.బొగ్గు  

పదమేది? : BASKET


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని