చిట్టి కారును నేను..!
ఏంటి... నన్ను అలా వింతగా చూస్తున్నారు.. బొమ్మ కారు భలే ఉంది.. అనుకుంటున్నారా... అలా అయితే మీరు పప్పులో కాలేసినట్లే! ఎందుకంటే నేను నిజం కారునే.. కాకపోతే బుజ్జికారును.. నాకో రికార్డు కూడా ఉంది తెలుసా?!
నా పేరు విండ్ అప్. ప్రపంచంలోకెల్లా అతిచిన్న రోడ్ లీగల్ కారును నేనే. అంటే నన్ను రోడ్డు మీద నడుపుకోవడానికి అన్ని అనుమతులూ ఉన్నాయి అన్నమాట. ఇంగ్లాండ్‌కు చెందిన పెర్రీ వాట్‌కిన్స్ నాకో రూపం ఇచ్చి ప్రాణం పోశాడు.
కార్టూన్ క్యారెక్టర్ స్ఫూర్తితో..
పోస్ట్‌మ్యాన్ పాట్స్ కార్.. అనేది ఓ కార్టూన్ క్యారెక్టర్. దీని స్ఫూర్తితోనే నన్ను తయారు చేశారు. నాలో ఒక్కరు మాత్రమే ప్రయాణించగలరు. అన్ని కార్లకు ఉన్నట్లే నాకు డోర్, అద్దాలు, లైట్లు, ఇండికేటర్లు ఉంటాయి. నాకు 150సీసీ ఇంజిన్ ఉంది.
నా ఎత్తు, పొడవు.. ఎంతంటే..
నేను 66.04 సెంటీమీటర్ల వెడల్పు, 132.08 సెంటీమీటర్ల పొడవు, 104.14 సెంటీమీటర్ల ఎత్తు ఉంటానంతే. నా వెనక ఓ కీ ఉంటుంది. కానీ దాంతో ప్రయోజనం ఏం ఉండదు. నా ఇంజిన్‌తోనే నేను నడుస్తాను. ఆ కీతో మాత్రం కాదు.
అందుకే రికార్డు దక్కింది
ప్రపంచంలోకెల్లా చిన్న కారు రికార్డు పీల్ పీ-50 పేరిట ఉండేది. కానీ నేను దాని కన్నా చిన్నదాన్ని. నేను దాని పరిమాణంలో సగమే ఉంటాను. పైగా దానికి మూడు చక్రాలే ఉంటాయి. నాకు మాత్రం అన్ని కార్లలాగే నాలుగు చక్రాలుంటాయి.
అందుకే నాకు ప్రపంచంలోకెల్లా అతి చిన్న రోడ్ లీగల్ కారు రికార్డు దక్కింది. ఇప్పటికీ మేం ఇద్దరం ‘నేనే చిన్న కారంటే.. నేనే చిన్నకారని’ అప్పుడప్పుడు సరదాగా గొడవ కూడా పడుతుంటాం. మొత్తానికి ఇవన్నమాట నా సంగతులు. నా గురించి మీకు చెప్పేశాను. నేను వచ్చిన పని కూడా అయిపోయింది. నేస్తాలూ.. ఇక ఉంటామరి.. బై.. బై..!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Sushil Modi: నా పిటిషన్‌పైనా రాహుల్‌కు శిక్షపడుతుందని ఆశిస్తున్నా.. సుశీల్ మోదీ
-
Sports News
IPL 2023: ఐపీఎల్లో ఏంటీ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్..?
-
Politics News
BJP vs Congress: ‘రాహుల్జీ మీకు ధన్యవాదాలు’.. జర్మనీపై దిగ్విజయ్ ట్వీట్‌కు భాజపా కౌంటర్!
-
Sports News
Best Fielder: ప్రస్తుతం ప్రపంచంలో బెస్ట్ ఫీల్డర్ అతడే: జాంటీ రోడ్స్
-
India News
Divya Spandana: అప్పుడు రాహులే నాకు మానసిక ధైర్యం ఇచ్చారు: నటి వ్యాఖ్యలు