వాడేసిన మాస్కే కదా అని వదిలేయకుండా..
మాస్కు వాడాక మనం ఏం చేస్తాం. ఏం చేస్తాం.. చెత్త బుట్టలో పడేస్తాం. కానీ ఓ అన్నయ్య మాత్రం వాటిని రీసైకిల్ చేస్తున్నాడు. ఎంచక్కా.. స్టూళ్లు తయారు చేస్తున్నాడు. పరోక్షంగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నాడు. మనసుంటే వ్యర్థాలకూ ఓ అర్థం ఇవ్వొచ్చని నిరూపిస్తున్నాడు.
కిమ్‌హ- నెయుల్... అనే అన్నయ్య దక్షిణ కొరియాకు చెందిన విద్యార్థి. ఓరోజు ఏదో పనిలో ఉండగా ఇతనికి ఓ ఆలోచన వచ్చింది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో మాస్కు లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి. మరి ఇలా వాడిన మాస్కులన్నింటిని ఏం చేస్తున్నారు. సింగిల్ యూజ్ మాస్కులైతే చెత్తబుట్టలోకి వెళుతున్నాయి. ఈ చెత్తంతా కొత్త సమస్యలకు కారణం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 12,900 కోట్ల మాస్కులను ఒక నెలలోనే వాడి పడేస్తున్నట్లు అంచనా. వీటిని కాల్చేస్తున్నారు. వీటిలో పాలీప్రొఫైలీన్ అనే పదార్థం ఉంటుంది. ఇదీ ప్లాస్టిక్ లాంటిదే. వీటిని ఇలా కాల్చడం వల్ల పెద్ద ఎత్తున కాలుష్యాలు వాతావరణంలో కలుస్తున్నాయి. దీని వల్ల పర్యావరణం తీవ్రంగా కలుషితం అవుతోంది. ఈ పరిస్థితిని మార్చాలనుకున్నాడు. కేవలం అనుకుని వదిలేయలేదు.
మాస్కులను రీసైకిల్ చేస్తే...
‘అసలు మాస్కులను ఎందుకు కాల్చాలి. ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేసినట్లే.. మాస్కులను కూడా ఎందుకు చేయకూడదు?’ అని వినూత్నంగా ఆలోచించాడు. అందులోంచే ఎత్తుపీటల (స్టూళ్లు) తయారీ ఆలోచన పుట్టుకొచ్చింది. ఒక్క స్టూలు తయారీకి దాదాపు 1,500 మాస్కుల అవసరం పడుతుంది. ముందుగా తయారుచేసుకున్న అచ్చుల్లో హాట్‌గన్ ద్వారా మాస్కులను కరిగించి అందులో నింపుతాడు. వాటన్నింటిని తీసి అతికించడం ద్వారా చివరికి స్టూలు తయారవుతుంది. ఇదంతా చేయడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. రంగురంగుల మాస్కులతో రంగురంగుల స్టూళ్లూ తయారు చేస్తున్నాడు. ఇవి చూడముచ్చటగా ఉండటంతో పాటు చాలా గట్టిగా కూడా ఉంటున్నాయి. వీటి జీవితకాలం కూడా ఎక్కువే. ప్రస్తుతానికైతే ఈ స్టూళ్లు అమ్మకానికి పెట్టలేదు. ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయి.
మరి కరోనా భయం లేదా!
ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా కరోనా కేసులే! మరి వాడిపడేసిన మాస్కులతో స్టూళ్లు తయారు చేసేటప్పుడు కరోనా వైరస్ సంక్రమించదా? అనే అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే ఈ అన్నయ్య ఆ మాస్కులను కొన్ని రోజులు పక్కన పెట్టిన తర్వాతే స్టూళ్ల తయారీకి వాడుతున్నాడు. పైగా హీట్‌గన్‌తో వాటిని కరిగించే క్రమంలో దాదాపు 300 డిగ్రీల ఉష్ణోగ్రతకు అవి గురవుతాయి. ఇంతవేడిలో ఏ వైరస్ కూడా బతకలేదు. చేతులకు గ్లౌజులు, మొహానికి మాస్కు ఉండనే ఉంటాయి. ఇక కరోనా రిస్క్ ప్రసక్తే లేదు అంటున్నాడు ఈ అన్నయ్య. నిజంగా కిమ్‌హ- నెయుల్ గ్రేట్ కదూ!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Harish Rao: ఇదేనా భాజపా చెబుతోన్న అమృత్కాల్?: హరీశ్‌రావు ఫైర్
-
Movies News
Social Look: వాణీకపూర్ ‘క్రైమ్ థ్రిల్లర్’.. చీరలో శోభిత హొయలు!
-
Politics News
BS Yediyurappa: సిద్ధూపై యడ్డీ తనయుడి పోటీ..?
-
World News
United Airlines: ఖరీదైన విస్కీ బాటిల్లో మద్యం చోరీ..కంగుతిన్న విమాన ప్రయాణికుడు
-
Politics News
Andhra News: ఉదయగిరికి వచ్చా.. దమ్ముంటే తరిమికొట్టండి: ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి సవాల్
-
India News
అశ్లీల దృశ్యాలు చూస్తూ.. వివాదంలో ఎమ్మెల్యే..!