పైలట్ లేకుండానే గాల్లో షికారు!
హాయ్ ఫ్రెండ్స్..! విమానానికి పిల్లలకు ఎంతో అనుబంధం ఉంది కదూ.. ఆకాశంలో విమానం కనిపిస్తే చాలు.. దాన్ని అలా చూస్తుండిపోతాం. అప్పుడప్పుడు అందులో ఉన్నవారికి ‘టాటా..’ కూడా చెబుతుంటాం. ఇదంతా సరే కానీ.. మీరు ఎప్పుడైనా విమానం ఎక్కారా..? ఎక్కకున్నా ఫర్లేదులే..! విమానాన్ని పైలట్ నడుపుతారని మాత్రం తెలుసుగా.. కానీ ఎవరూ నడపకున్నా... విమానం దానంతట అదే గాల్లోకి ఎగురుతుంది. గమ్యస్థానానికి చేరుతుంది. కాక్‌పిట్‌లోని కంట్రోల్స్ అన్నీ దానికవే కంట్రోల్ అవుతాయి. స్టీరింగ్ కూడా దానికదే తిరుగుతుంది. ఓ అమెరికా కంపెనీ ఈ దిశగా ప్రయోగాలు చేస్తోంది.
‘అదేంటి.. పైలట్ లేకుండా నడిచే విమానాలు ఎప్పటి నుంచో ఉన్నాయిగా.. ఇప్పుడే కొత్తగా వచ్చినట్లు చెబుతున్నారు ఏంటి?’ అని మీకు ఈపాటికే సందేహం వచ్చి ఉంటుంది. నిజమే మానవరహిత విమానాలు ఇంతకు ముందే ఉన్నాయి. కానీ అవి వేరు.. ఇది వేరు! అవి పరిమిత దూరాలకే పరిమితమవుతాయి. పైగా అవి చాలా చిన్నవి. ఓ రకంగా కాస్త పెద్ద డ్రోన్లలాంటివి. కానీ ప్రస్తుతం మనం చెప్పుకుంటోంది.. మామూలు విమానాలనే పైలట్ రహితంగా మార్చడం గురించి..
ఎలా పని చేస్తుందంటే..
భూమి మీద నడిచే వాహనాల్లో డ్రైవర్ లేకుండా సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ లాగానే పైలట్ లేకుండానే ఈ అటానమస్ ఫ్లయింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. లైడార్, కెమెరాలు, నావిగేటింగ్ సెన్సర్ల వంటి వాటి సాయంతో విమానాలు గాల్లో ఎగురుతాయి. ఏటీసీతోనూ ఇవి కమ్యూనికేట్ అవుతుంటాయి. అచ్చం పైలట్ లాగానే ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటాయి.
ప్రస్తుతానికైతే..
ప్రస్తుతం ప్రయోగాల్లో అయితే కాక్‌పిట్‌లో పైలట్ సీట్లో కూర్చొని అన్ని సిస్టమ్స్ చెక్ చేసి అటానమస్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేస్తే.. సరిపోతుంది. టేకాఫ్ అయిన తర్వాత కాక్‌పిట్‌లోని కంట్రోల్స్ వాటికవే కదులుతుంటాయి. విమానం రెక్కలకు అమర్చిన సెన్సర్లు, కెమెరాలు రియల్‌టైంలో చుట్టూ పరిసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. పరిస్థితులను విశ్లేషిస్తుంటాయి. గాల్లో ఎగురుతున్న ఇతర విమానాలను కూడా అటానమస్ సిస్టమ్ గుర్తిస్తుంది. కొన్ని దశాబ్దాలుగా విమానాల్లో ఆటోపైలట్ మోడ్‌ను వాడుతున్నారు. దాన్నిప్పుడు ఇంకాస్త అభివృద్ధి చేసి ఈ అటానమస్ సిస్టమ్‌ను రూపొందించారు.
2019లోనే...
మానవ పైలట్ సాయం లేకుండా.. 2019 లోనే తొలిసారి విమానాన్ని గాల్లో ఎగిరేలా చేశారు. అప్పటి నుంచి వరుసగా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని కార్గో రవాణాలో ఉపయోగించాలనేది ప్రణాళిక. అది కూడా జనావాసాలు లేని మార్గాల్లో ఈ విమానాలు ప్రయాణిస్తాయి. కార్గో విమానాల్లో ప్రయాణికులు ఉండరు కాబట్టి, సాంకేతిక సమస్యలు వచ్చినా ప్రాణనష్టం ఉండదు. మొత్తానికి మనం కొంతకాలంలోనే పైలట్ లేకుండా నడిచే పే..ద్ద విమానాలను చూస్తాం అన్నమాట. సైన్సు ఎంతో గొప్పది కదూ! అది తలుచుకుంటే ఏమైనా చేస్తుంది అనిపిస్తుంది కదా.. నేస్తాలూ!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Heartbreaking Story: మా అమ్మ కన్నీటితో డైరీలో అక్షరాలు తడిసిపోయాయి..!
-
World News
ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ మాయం..ఎయిర్టాగ్తో నిందితుడిని గుర్తించిన ప్రయాణికుడు
-
Movies News
Jagapathi Babu: అడవిని తలపించే ఇల్లు.. జగపతి బాబు తల్లి జీవన విధానమిది
-
India News
Karnataka: ఎన్నికల వేళ.. ముఖ్యమంత్రి కారులో తనిఖీలు..!
-
India News
Smriti Irani: ఆ విషయం చెప్పడానికి నాకు 40 ఏళ్లు పట్టింది: స్మృతి ఇరానీ
-
Politics News
Guntur: తెనాలిలో వైకాపా అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి: ఆలపాటి రాజేంద్రప్రసాద్