‘ఓర్’నాయనో.. ఇదేం చేప!
హాయ్.. ఈ బొమ్మలో కనిపించేది బారెడు పొడవుంది. అయితే ఇది కచ్చితంగా పామే అనుకుంటున్నారేమో! అలా అయితే మీ కళ్లు మిమ్మల్ని మోసం చేసినట్టే. ఎందుకంటే అది ఓ పే..ద్ద చేప. అమ్మో ఇంత పెద్ద చేపలు కూడా ఉంటాయా.. అని అనుమానం వస్తోంది కదూ! నిజమే.. మరి ఎందుకు రాదూ.. కానీ ఇంత పెద్ద చేప ఎలా దొరికిందో కాస్త తెలుసుకుందామా!
హాయ్.. ఈ బొమ్మలో కనిపించేది బారెడు పొడవుంది. అయితే ఇది కచ్చితంగా పామే అనుకుంటున్నారేమో! అలా అయితే మీ కళ్లు మిమ్మల్ని మోసం చేసినట్టే. ఎందుకంటే అది ఓ పే..ద్ద చేప. అమ్మో ఇంత పెద్ద చేపలు కూడా ఉంటాయా.. అని అనుమానం వస్తోంది కదూ! నిజమే.. మరి ఎందుకు రాదూ.. కానీ ఇంత పెద్ద చేప ఎలా దొరికిందో కాస్త తెలుసుకుందామా!
తైవనీయుడైన ఓ జాలరి రోజూలాగే చేపల వేటకు వెళ్లాడు. ఓ రోజు యిలాన్ కౌంటీలోని డాంగ్ అవొ తీరంలో చేపలు పడుతుండగా అతనికి 5మీటర్ల పొడవున్న ఓ పేద్ద ‘ఓర్’ చేప చిక్కింది. దాని బరువు ఏకంగా 45 కిలోలు. అదే రోజున రెండుసార్లు భూకంపం వచ్చింది. అందుకే ఆ చేపను ‘ఎర్త్ క్వేక్ ఫిష్’ అని పిలుస్తుంటారు. దాన్ని ఓ రెస్టారెంట్ ఓనర్ 16 వేల న్యూ తైవాన్ డాలర్లకు కొన్నాడు. దీని కేజీ మాంసం ధర 400 న్యూ తైవాన్ డాలర్లుంటుందట. సాధారణంగా తెల్లవారు ఝామున లేదా సాయంకాలం చేపలు వలలో చిక్కుకుంటాయి. కానీ ఈ చేప అర్ధరాత్రి వేళ తన వలకు చిక్కిందట. 55 ఏళ్లుగా సీఫుడ్ రెస్టారెంట్ నడిపిస్తున్న చెన్ అనే వ్యక్తి ఇంత పెద్ద చేపను తానెన్నడూ చూడలేదని ఆశ్చర్యపోతున్నాడు. ఏటా ఓర్ రకం చేపలు దొరుకుతుంటాయి. కానీ అవి 100 నుంచి 200 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటాయంటున్నాడు చెన్. ఇది ఏకంగా 5 మీటర్లంటే.. అమ్మో! చాలా అరుదు అని, నిజంగా తన కళ్లను తాను నమ్మలేకపోయాడట.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్‌గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్‌కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం