నవ్వుల్‌... నవ్వుల్‌...!

టీచర్‌: ‘నారు పోసినోడే.. నీరు పోస్తాడు’ ఇలాంటి సామెత మరోటి చెప్పు బిట్టూ!

Updated : 05 Sep 2022 00:31 IST

అంతేగా.. అంతేగా...!

టీచర్‌: ‘నారు పోసినోడే.. నీరు పోస్తాడు’ ఇలాంటి సామెత మరోటి చెప్పు బిట్టూ!
బిట్టు: పాఠం చెప్పినవారే పరీక్ష రాయాలి.. టీచర్‌.
టీచర్‌: ఆఁ!!

దటీజ్‌ కిట్టూ!

టీచర్‌: కిట్టూ.. వర్షం వచ్చేటప్పుడు ఉరుములు ఎందుకు వస్తాయో చెప్పు?
కిట్టు: భూమి పూర్తిగా తడిసిందో లేదో తెలుసుకోవడానికి వానదేవుడు టార్చిలైట్‌ వేసి చూస్తాడు టీచర్‌.
టీచర్‌: ఆఁ!!

అయ్యబాబోయ్‌!

టీచర్‌: ‘వర్ణనాతీతం’... ఈ పదాన్ని ఉపయోగించి ఓ అర్థవంతమైన వాక్యం చెప్పు చింటూ.
చింటు: ఎగ్జామ్‌ హాల్లో మనం రాయలేకపోయిన బాధ కన్నా... మన ఫ్రెండ్‌ అడిషనల్‌ మీద అడిషనల్‌ తీసుకుని పేపర్లు మొత్తం నింపుతున్నప్పుడు వచ్చే బాధ, కోపం వర్ణనాతీతం టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని