స్వర్గలోకపు పక్షిని నేను!
హాయ్ ఫ్రెండ్స్... ఏంటి అలా వింతగా చూస్తున్నారు. అయినా నేను కాస్త విచిత్రంగానే ఉన్నాను కదా! అందుకే అలా చూస్తున్నారు కదూ! మరి నా పేరు, ఊరు, ఇంకా మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి.
నేను స్వర్గలోకపు పక్షిని. అదేనండి నన్ను ‘బర్డ్ ఆఫ్ ప్యారడైజ్’ అని పిలుస్తారు. మాలో దాదాపు 45 రకాల పక్షులున్నాయి. ఇండోనేషియా, న్యూగినియా, ఆస్ట్రేలియాలో నేను కనిపిస్తుంటాను. మేం కాస్త కాకి, కోకిల పోలికలతో ఉన్నప్పటికీ మిగతా పక్షుల కంటే భిన్నంగానే ఉంటాం. రంగురంగుల ఈకలు, అందమైన తోకతో భలేగా ఉంటాం. స్వర్గలోకం నుంచి వచ్చిన పక్షిలా కనిపిస్తాను.. కాబట్టే నన్ను బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అని పిలుచుకుంటారు.
బరువెంతంటే...!
మేం దాదాపు 50 గ్రాముల నుంచి 430 గ్రాముల వరకు బరువుంటాం. 15 సెంటీమీటర్ల నుంచి 44 సెంటీమీటర్ల వరకు పొడవుంటాం. మాలో సిక్లేబిల్స్ అనే పక్షికి అన్నింటికన్నా పొడవైన తోక ఉంటుంది. దాని పొడవు ఏకంగా 110 సెంటీమీటర్ల వరకు ఉంటుంది.
ఏం తింటామంటే...
మేం ఎక్కువగా పండ్లు, గింజలను ఆహారంగా తీసుకుంటాం. అలా అని మేం పూర్తి శాకాహారులం కాదు. పురుగులనూ తిని మా బుజ్జి బొజ్జలు నింపుకొంటాం. న్యూగినియాలో ఉన్న అడవులు ఏర్పడింది ఒక విధంగా మా వల్లే. ఎలా అంటే... మేం ఎక్కువగా పండ్లను ఆహారంగా తీసుకుంటాం కదా.. కానీ మేం వాటి గింజలను జీర్ణించుకోలేం. వాటిని అలాగే విసర్జిస్తాం. ఆ విత్తనాలు మొలకెత్తి కొత్త మొక్కలు వస్తాయి. అవి చెట్లుగా పెరుగుతాయి. ఇలా మా కారణంగానే చాలా వరకు న్యూగినియాలో అడవులు ఏర్పడ్డాయి.
మెత్తని గూళ్లు...!
మేం మెత్తటి పదార్థాలతో గూళ్లను తయారు చేసుకుంటాం. ఆకులు, ఈకలు, లేత చిగుళ్లను ఎక్కువగా ఉపయోగిస్తాం. మేం సాధారణంగా ఒక్క గుడ్డునే పెడతాం. మాలో కొన్ని రకాలు రెండు నుంచి మూడు గుడ్లనూ పెడతాయి. వీటి నుంచి దాదాపు 16 నుంచి 22 రోజుల తర్వాత పిల్లలు బయటకు వస్తాయి. ఇవి 16 నుంచి 30 రోజుల తర్వాత గూటి నుంచి ఎగిరిపోతాయి. అన్నట్లు మీకు మరో విషయం తెలుసా... బర్డ్‌ఆఫ్ ప్యారడైజ్ పేరుతో మొక్కలు కూడా ఉన్నాయి. ఈ మొక్కలకు పూసే పువ్వులు అచ్చం మాలానే ఉంటాయి కాబట్టి ఆ మొక్కలకు ఆ పేరు వచ్చింది. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ మా విశేషాలు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Saudi Arabia: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది హజ్ యాత్రికుల మృతి
-
Politics News
Vangalapudi Anitha: 40 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు: అనిత
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు
-
World News
ఉనికికే ముప్పొస్తే ఎవరినైనా లేపేస్తాం: అమెరికాకు రష్యా తాజా హెచ్చరిక
-
India News
సోదరి వివాహానికి రూ.8.1 కోట్ల కానుకలు
-
Politics News
రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె