నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నాన్న: చిన్నా.. ఏం చేస్తున్నావు?, చిన్నా: చదువుకుంటున్నాను నాన్నా!, నాన్న: అలాగే.. బాగా చదువుకో చిన్నా.. పెద్దయ్యాక విమానం ఎక్కి విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయొచ్చు..

Updated : 30 Mar 2024 00:52 IST

నాకు భయం..!

నాన్న: చిన్నా.. ఏం చేస్తున్నావు?
చిన్నా: చదువుకుంటున్నాను నాన్నా!
నాన్న: అలాగే.. బాగా చదువుకో చిన్నా.. పెద్దయ్యాక విమానం ఎక్కి విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయొచ్చు..
చిన్నా: అయితే.. నేను రేపటి నుంచి చదవను..
నాన్న: ఎందుకు.. ఏమైంది?
చిన్నా: నాకు విమానం ఎక్కడం అంటే భయం నాన్నా!

సరిదిద్దుకుందామని..!

కిట్టు: చింటూ.. నీకో విషయం చెప్పనా..!
చింటు: చెప్పు కిట్టూ వింటాను
కిట్టు: ఆలస్యమైనా.. చేసిన తప్పును సరిదిద్దుకోవాలంట తెలుసా!
చింటు: అవునా..!
కిట్టు: అవునా అంటూ.. అలా వెళ్లిపోతావేంటి?
చింటు: నేను పరీక్ష సరిగ్గా రాయలేదు.. మార్కులు తక్కువగా వచ్చాయి.. వాటిని దిద్దేద్దామని..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని