నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అది నేను కదా!

Published : 03 Apr 2024 00:34 IST

అది నేను కదా!

చంటి: ఏంటి చింటూ.. ఏదో ఆలోచిస్తున్నావు? 

చింటు: మరేం లేదు చంటీ.. మా అన్నయ్యకి ‘స్టోరీ టెల్లింగ్‌’లో మొదటి బహుమతి వచ్చింది!

 చంటి: అయితే.. మంచిదే కదా! దానికి ఎందుకు ఆలోచించడం?

చింటు: హోంవర్క్‌ చేయని ప్రతీసారి నేను కదా.. ఎక్కువ కథలు చెప్పేది. తనకెలా మొదటి బహుమతి వస్తుంది..!


కొత్తగా ప్రయత్నించా!

అమ్మ: కిట్టూ.. ఏంటి నీకు ఈసారి మ్యాథ్స్‌ పరీక్షలో సున్నా మార్కులు వచ్చాయి?
కిట్టు: నువ్వే కదమ్మా.. ఏం చేసినా కొత్తగా చేయాలి అన్నావు..!
అమ్మ: అయితే..!
కిట్టు: అందుకే.. 10+10=30, 10+20=40.. అని ఇలా అన్నీ మార్చి, కొత్తగా రాశాను!


అదే సందేహం!

చిన్ని: మిన్నీ.. నాకో సందేహం వచ్చింది అడగనా?
మిన్ని: అడుగు చిన్నీ.. ఏంటో..!
చిన్ని: మనకు సెలవులు ఒక ఎండాకాలంలోనే ఎందుకు ఇస్తారు.. ఎంచక్కా చలికాలం, వర్షాకాలంలో కూడా ఇవ్వొచ్చు కదా!
మిన్ని: అప్పుడు స్కూల్స్‌ నడపాల్సిన పని ఉండదు కదా అందుకు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని