నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

Published : 29 Apr 2024 00:09 IST

మనం పెడతాం కదా..!

చింటు: బంటీ ఏమైంది.. ఒక్కడివే కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు?
బంటి: మరేం లేదు.. కోళ్ల గురించి ఆలోచిస్తున్నా..!
చింటు: ఏమని?
బంటి: మనకేమో.. పుట్టగానే రకరకాల పేర్లు ఉంటాయి కదా.. వాటికెందుకు ఒకే పేరు ఉంటుందా అని..!
చింటు: కాస్త అలస్యంగా అయినా.. అవి చచ్చిపోయాక మనం పెడతాం కదా.. బటర్‌ చికెన్‌, చికెన్‌ తందూరి, చికెన్‌ టిక్కా.. అని!

నువ్వు చెప్పలేదు కదమ్మా..!

అమ్మ: చిన్నీ.. నేను బయటికి వెళ్లొస్తాను. వచ్చేలోపు కుక్కర్‌లో రైస్‌ పెట్టు!
చిన్ని: అలాగేనమ్మా..!
అమ్మ: ఏంటి చిన్నీ.. రైస్‌ పెట్టావు కానీ, స్విచ్‌ వేయలేదు?
చిన్ని: నువ్వు రైస్‌ మాత్రమే పెట్టమన్నావు కదమ్మా.. స్విచ్‌ గురించి ఏం చెప్పలేదు కదా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని