నవ్వుల్‌.. నవ్వుల్‌..!

బిట్టు: కిట్టూ.. ఈ రోజు ప్రశ్నాపత్రం ఎలా వచ్చింది? 

Published : 06 Apr 2024 00:34 IST

అలా రాశా..!

బిట్టు: కిట్టూ.. ఈ రోజు ప్రశ్నాపత్రం ఎలా వచ్చింది?
కిట్టు: చాలా కష్టంగా వచ్చింది బిట్టూ..!

బిట్టు: అయ్యో..! మరి జవాబులు ఎలా రాశావు?
కిట్టు: ప్రశ్నల కంటే.. కష్టమైన జవాబులు రాసొచ్చా బిట్టూ..!

ఆదే ఆలోచిస్తున్నా!

నాన్న: చింటూ.. చదువుకోకుండా పుస్తకం పట్టుకొని ఏం ఆలోచిస్తున్నావు?
చింటు: మరేం లేదు నాన్నా.. వేసవి సెలవులు వస్తున్నాయి కదా!

నాన్న: అవును.. అయితే?
చింటు: ‘పిల్లలకు ప్రతిరోజు మూడు పూటలా మూడు ఐస్‌క్రీంలు కొనిపెట్టాలి, నచ్చినంతసేపు ఆడుకోనివ్వాలి’ అని మ్యానిఫెస్టో వస్తే బాగుండు అని ఆలోచిస్తున్నా నాన్నా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని