నవ్వుల్‌.. నవ్వుల్‌..!

ఏంటి చంటీ.. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?

Published : 30 Apr 2024 00:08 IST

అదే ఆలోచిస్తున్నా..!

చింటు: ఏంటి చంటీ.. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
చంటి: మరేం లేదు చింటూ.. నీకు చలివేంద్రం అంటే తెలుసు కదా!
చింటు: హా.. తెలుసు! ఎండాకాలంలో అందులోనే కదా, తాగేందుకు మంచి నీళ్లు ఏర్పాటు చేస్తారు..!
చంటి: అవును..! మరి వేసవికాలంలో చలి తగ్గేందుకు ఫైర్‌ క్యాంపులు ఎందుకు ఏర్పాటు చేయరా అని ఆలోచిస్తున్నా..!

స్మార్ట్‌ వర్క్‌..!

అమ్మ: బంటీ.. బాగా గుర్తుపెట్టుకో.. స్మార్ట్‌గా వర్క్‌ చేయడం నేర్చుకోవాలి సరేనా..!
బంటి: అలాగేనమ్మా..!
అమ్మ: అలాగేనంటూ.. హోంవర్క్‌ రాయకుండా వెళ్తావేంటి?
బంటి: నువ్వే కదమ్మా.. స్మార్ట్‌గా వర్క్‌ చేయాలి అన్నావు.. నేను రాయకుండా ఆ అంశం మొత్తం ప్రింట్‌ తీయుంచుకొని వద్దామని!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని