నవ్వుల్‌.. నవ్వుల్‌..!

బంటీ.. తెలుగు పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయి?

Published : 12 Apr 2024 00:50 IST

వందకు పైనే..!

నాన్న: బంటీ.. తెలుగు పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయి?
బంటి: వందకు పైనే వచ్చాయి నాన్నా..!
నాన్న: మార్కులు అలా వేయరే.. ఒకసారి పేపర్‌ చూపించు..!
బంటి: ఇదిగో నాన్నా..!
నాన్న: ఆరు మార్కులు వస్తే.. వందకు పైనే అని చెబుతున్నావేంటి బంటీ..!
బంటి: వంద పైనే కదా నాన్నా.. ఆరు మార్కులు వేసింది అందుకే..!


నువ్వు తినేదే కావాలి..!

చిట్టి: చిన్నీ.. నువ్వు ఏం తింటావు.. చాక్లెట్స్‌ తీసుకురానా?
చిన్ని: నువ్వు రోజూ ఏం తింటావో అదే పెట్టు పర్లేదు..
చిట్టి: నీకు నచ్చింది చెప్పు చిన్నీ.. తీసుకొస్తాను..!
చిన్ని: నాకు నువ్వు తినేదే పెట్టు!
చిట్టి: అలాగే..
చిన్ని: అలాగేనంటూ.. కొడతావేంటి?
చిట్టి: నేను ప్రతిరోజు ఇలాగే మా అమ్మతో దెబ్బలు తింటాను మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని