కనుక్కోండి చూద్దాం!

ఈ బొమ్మలో కొన్ని ఆంగ్ల అక్షరాలు గజిబిజిగా అతుక్కొని ఉన్నాయి. అన్ని వైపుల నుంచి జాగ్రత్తగా పరిశీలించి వాటిని ఓ క్రమపద్ధతిలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి.

Updated : 19 Apr 2021 01:46 IST

ఈ బొమ్మలో కొన్ని ఆంగ్ల అక్షరాలు గజిబిజిగా అతుక్కొని ఉన్నాయి. అన్ని వైపుల నుంచి జాగ్రత్తగా పరిశీలించి వాటిని ఓ క్రమపద్ధతిలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి.


క్విజ్‌.. క్విజ్‌..

1. కంప్యూటర్‌ను కనగొన్నదెవరు?
2. ‘గిర్‌ నేషనల్‌ పార్క్‌’ ఎక్కడుంది?
3. క్రికెట్‌ ఆటలో జట్టుకు ఎంతమంది సభ్యులుంటారు?
4. ‘గేట్ వే ఆఫ్‌ ఇండియా’ ఎక్కడుంది?
5. ఉత్తరాఖండ్‌ రాజధాని ఏది?
6. వూహాన్‌ నగరం ఏ దేశంలో ఉంది?
7. ‘మిడ్‌ఆన్‌’ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది?


వాక్యాల్లో వ్యక్తుల పేర్లు

ఇక్కడున్న వాక్యాల్లో వ్యక్తుల పేర్లు దాగున్నాయి. జాగ్రత్తగా చదివితే అవి కనిపిస్తాయి. కనిపెట్టగలరేమో.. ఓ సారి ప్రయత్నించి చూడండి.
1. ఆ రోజు అందరం గమ్మత్తుగా దారి తప్పిపోయాం కదా..
2. నువ్వు రోడ్డు మీద వంకరటింకరగా వెళ్లడం చూశాం. తిన్నగా వెళ్లొచ్చుగా..!  
3. ఇందాక ఆ పావురమే బాసూ.. రివ్వున గాల్లోకి ఎగిరిపోయింది.  
4. ఒరేయ్‌ మామ.. మతలబు ఏంటో తెలిసిందా?
5. ఇదిగో పూలమాల.. తిన్నాక వచ్చి తీసుకు పో.. కాస్త.  


అక్షరాల చెట్టు


ఇంతకీ ఏదో తెలుసా?

ఇక్కడ టామీ, బ్రౌనీ, పప్పీ ఉన్నాయి. వీటిలో ఒకదాన్ని మాత్రమే టిల్లూ వాళ్లు పెంచుకున్నారు. దేన్నో కనిపెట్టండి చూద్దాం.  


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నది ఏది?


నేను గీసిన బొమ్మ


జవాబులు

అది ఏది: 3

ఇంతకీ ఏదో తెలుసా: బ్రౌనీ

అక్షరాల చెట్టు: స్వాతంత్య్ర సమరయోధుడు

వాక్యాల్లో వ్యక్తుల పేర్లు: 1.రంగమ్మ 2.శాంతి 3.సూరి 4.మమత 5.మాలతి 

 క్విజ్‌.. క్విజ్‌.. : 1. చార్లెస్‌ బాబేజ్‌ 2. గుజరాత్‌ 3. పదకొండు 4. ముంబై 5. డెహ్రాడూన్‌ 6.చైనా 7.క్రికెట్‌

కనుక్కోండి చూద్దాం: double

సుడోకు


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని