నల్లచందనం.. ధరలో తగ్గేదే లే!
ఏంటి ఫ్రెండ్స్.. శీర్షిక వైపు అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ‘ఎర్రచందనం అని కదా ఉండాలి.. నల్లచందనం అని ఉందేంటబ్బా..?’ అని ఆలోచిస్తున్నారు కదూ! ఇది ఎర్రచందనం కాదు.. నల్లచందనమే! ‘ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్’ అంటారు దీన్ని. ఆ మాటకొస్తే ఎర్రచందనం కంటే దీని ఖరీదే ఎక్కువ! ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ ధర పలికే కలపల్లో ఈ ‘ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్’ కూడా ఒకటి.
అకేషియా మిలానోక్సీలాన్... ఏంటి మళ్లీ అవాక్కయ్యారా! ఇది ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్ అసలు పేరు. ఇంకా జ్రెనాడిల్లా, ఎమ్‌పిన్‌గో అని కూడా పిలుస్తారు. ఇవన్నీ కష్టంగా ఉన్నాయి కదూ.. అందుకే బ్లాక్‌వుడ్ అని పిలిచేసుకుందాం.. సరేనా!
స.. రి.. గ.. మ.. ప..
ఈ బ్లాక్‌వుడ్‌ను ఎక్కువగా సంగీత పరికరాల తయారీలో వాడతారు. ఇంకా ఫర్నిచర్ తయారీలోనూ ఉపయోగిస్తారు. నిజానికి ఇది మరీ అంత పెద్ద చెట్టేం కాదు. 4 నుంచి 15 మీటర్ల పొడవు పెరుగుతుందంతే. మన దగ్గర వెదురుతో ఫ్లూట్లు తయారు చేస్తారు కదా.. కానీ ఆఫ్రికాలో ఫ్లూట్ తయారీలో ఈ బ్లాక్‌వుడ్‌నూ వాడతారంట.
చైనాలో చాలా క్రేజ్..
ఈ బ్లాక్‌వుడ్ పేరుకు తగ్గట్లే ముదురు ఎరుపు, నల్ల రంగులో ఉంటుంది. కలప చాలా నాణ్యంగా ఉంటుంది. మన దగ్గర ఎర్రచందనం ఎలా అయితే అక్రమ రవాణా అవుతుందో ఆఫ్రికాలోనూ ఈ బ్లాక్‌వుడ్ స్మగ్లింగ్ జరుగుతుంది. చైనాలో ఎర్రచందనానికి ఎంత క్రేజ్ ఉంటుందో.. ఈ నల్లచందనానికి కూడా అంతే డిమాండ్ ఉంది. అడ్డూ అదుపూ లేని స్మగ్గింగ్ వల్ల ఈ చెట్ల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. నిజానికి ఒక బ్లాక్‌వుడ్ చెట్టు నుంచి నాణ్యమైన కలప రావాలంటే కనీసం 60 సంవత్సరాలు పడుతుంది.
చాలా.. ఖరీదు!
ఈ బ్లాక్‌వుడ్ ధర చాలా చాలా ఎక్కువ ఉంటుంది. కేవలం కిలో కలపకే దాదాపు ఎనిమిదిలక్షల రూపాయల ఖర్చవుతుంది. అరుదుగా దొరకడం, కలప నాణ్యంగా ఉండటమే దీనికి కారణం. ఈ కలపతో చేసిన వస్తువులు కూడా ఎక్కువ కాలం మన్నుతాయి. మొత్తానికి ఈ నల్లచందనం ముందు ఎర్రచందనం కూడా దిగదుడుపే అన్నమాట. ఫ్రెండ్స్.. ప్రస్తుతానికి ఇవీ ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్ విశేషాలు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Parliament: ‘అదానీ’ అంశంపై చర్చకు పట్టు.. వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా
-
India News
నిరుద్యోగ సమస్యకు కారణమదే.. ఉద్యోగాల కోసం వెంపర్లాడొద్దు: మోహన్ భాగవత్
-
Sports News
IND vs AUS: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ.. గెలిచేది ఆ జట్టే: మహేల జయవర్దనే
-
General News
Amaravati: రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ
-
India News
Delhi Mayor: దిల్లీ మేయర్ ఎన్నిక.. ముచ్చటగా మూడోసారి విఫలం..!
-
Movies News
Balakrishna: నా మాటలను వక్రీకరించారు.. నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ