అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Updated : 12 Apr 2022 06:37 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


చెప్పుకోండి చూద్దాం?

1. ముక్కూ, నోరూ ఉన్నా.. ఒక్క మాటైనా మాట్లాడని చిలుక. రెక్కలు ఉన్నా.. ఎగరలేని చిలుక. కాళ్లు ఉన్నా.. కదలక మెదలక ఉండే చిలుక. ఏంటో చెప్పుకోండి చూద్దాం?

2. సంగీతానికి, ఇంటికి ఇది లేకపోతే కష్టం. అది తప్పక అవసరం. ఏంటో తెలుసా?

3. నేను రుచీ, వాసనా లేని బిస్కెట్‌ను. రంగు మాత్రం ఉంటుంది. మీరు నన్ను ఎంతో ఇష్టపడి కొంటారు. భద్రంగా చూసుకుంటారు. కానీ తినలేరు. ఇంతకీ నేనెవరో తెలుసా?


పదచక్రం

వృత్తాల్లోని ఖాళీ గడులను సరైన అక్షరాలతో పూరిస్తే.. అర్థవంతమైన పదం వస్తుంది. ఎటునుంచైనా, ఎక్కడినుంచైనా పదం ప్రారంభం కావొచ్చు. ఓసారి ప్రయత్నించండి.


అక్షరాల ఆట!

ఇక్కడున్న ఆధారాల సాయతో ఖాళీ గడులను సరైన అక్షరాలతో నింపండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


తమాషాప్రశ్నలు

1.  తినగలిగే హారం?

2. ఆడుకోగలిగే దానం?

3. ఆశ్రయం ఇవ్వలేని టెంట్‌?


ఆ ఒక్కటి ఏది?

ఇక్కడున్న అంశాల్లో ఒక్కటి మాత్రం మిగతావాటికి భిన్నంగా ఉంది. అది ఏదో కనిపెట్టగలరా?

1. 633, 422, 844, 312, 421, 624, 945, 835

2. FED, RQP, WVU, OMN, KJI, TSR



నేను గీసిన బొమ్మ


జవాబులు

అక్షరాల ఆట: 1.కనులు 2.కవిత 3.కలువ 4.కలము 5.కమలం 6.కఠినం 7.కణము, కణిక 8.కణత 9.కలప 10.కలత

చెప్పుకోండి చూద్దాం?: 1.పంచదార చిలక 2.తాళం 3.బంగారు బిస్కెట్‌

తమాషా ప్రశ్నలు: 1.ఆహారం 2.మైదానం 3.మిలిటెంట్‌

ఆ ఒక్కటి ఏది : 1.421 (మిగతావాటిలో రెండో, మూడో అంకెలను కలిపితే మొదటిది వస్తుంది.) 2. OMN (మిగతా అక్షరాలన్నీ రివర్స్‌లో ఉన్నాయి.)

అదిఏది?: 2

పదచక్రం : 1. BETTER 2. ERASER


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని