అది ఏది?

మొదటి బొమ్మను పొలిఉన్నది ఏది?

Updated : 06 May 2022 05:33 IST

మొదటి బొమ్మను పొలిఉన్నది ఏది?


చెప్పుకోండి చూద్దాం?

1. చుక్కల చుక్కల రాణిని.. బంగారు వన్నెల ప్రాణిని.. బిత్తర చూపుల దానిని.. చెంగుచెంగున దూకే దాన్ని.. ఇంతకీ నేనెవరో తెలుసా?
2. ముళ్లపొదల్లో మిఠాయి పొట్లం, తీయాలంటే కావాలి చాకచక్యం.. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
3. తలలేదు కానీ రక్షణకు గొడుగు ఉంది, పాము లేదు కానీ పుట్ట ఉంది.. నేనెవరో తెలుసా?
4. పగలేమో కఠోర తపస్వి, రాత్రైతే భయంకర రాక్షసి.. ఏంటో చెప్పుకోండి చూద్దాం?



తమాషా ప్రశ్నలు?
1. కలత చెందేలా చేసే వరం?
2. ఉత్తరానికి, దక్షిణానికి ఉన్న తేడా ఏంటి?
3. మనకు కలలు ఎందుకువస్తాయి?
4. మిరపకాయ కొరికితే ఏమవుతుంది?


ఇంతకీ ఏ పండు?
ఇక్కడ కొన్ని పండ్ల చిత్రాలున్నాయి. ఇందులో ఓ పండు మాత్రం మిగతావాటికి భిన్నం. అది ఏది? ఎందుకో మీకేమైనా తెలుసా?


నేను గీసిన బొమ్మ


జవాబులు
అది ఏది?: 2  చెప్పుకోండి చూద్దాం?: 1.జింక 2.తేనెపట్టు 3.పుట్టగొడుగు 4.గబ్బిలం తమాషా ప్రశ్నలు: 1.కలవరం 2.ఉత్తరాన్ని పోస్టు డబ్బాలో వేయగలం, కానీ దక్షిణాన్ని వేయలేం 3.కంటాం కాబట్టి 4.ముక్కలవుతుంది గజిబిజి బిజిగజి: 1.సాహసబాలుడు 2.సాగరతీరం 3.మహానటి 4.సాయంకాలం 5.సాహసోపేతం 6.పరోపకారం 7.మహాపాపం  ఇంతకీ ఏ పండు?: స్ట్రాబెర్రీ (అన్ని పండ్లకు విత్తనాలు లోపల ఉంటాయి. ఒక్క స్ట్రాబెర్రీకి మాత్రం  బయట వైపు విత్తనాలుంటాయి)
చెప్పగలరా : 1.CHOCOLATE 2. DIAMOND
రాయగలరా?: 1.వాన 2.నక్క 3.నలుపు 4.చులకన 5.నల్లులు 6.నవ్వు 7.నమ్మకం 8.నలత 9.నయనం 10.వానరం 11.నరకం 12.నరుడు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని