అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 26 Jul 2022 01:12 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


పొడుపు కథలు

1. రాళ్ల అడుగున విల్లు, విల్లు కొనలో ముల్లు.. ఏంటో తెలుసా?
2. పచ్చని భవనం, తెల్లని గదులు, నల్లని రాజులు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
3. పొంచి ఉన్న దెయ్యం, పోయిన చోటకల్లా వస్తుంది. చీకటి పడితే మాత్రం మాయం అవుతుంది. అదేంటో తెలుసా మీకు?


తమాషా ప్రశ్నలు

1. గుండ్రంగా ఉండని గోళం?
2. ఒంట్లో ఉండని నరం?
3. చూడలేని నయనం?


చెప్పుకోండి చూద్దాం..

అదో చిన్న పట్టణం. ఆ పట్టణంలో ఓ పెద్ద పార్కు. అక్కడ బెంచీ మీద ఓ పిల్లాడు, ఓ లాయరు కూర్చుని ఉన్నారు. ఆ పిల్లాడు ఆ లాయరు కొడుకే. కానీ ఆ లాయరు మాత్రం తండ్రి కాదు. ఇదెలా సాధ్యం! మీరేమైనా చెప్పగలరా?


అంతమే ఆరంభం!

ఆధారాల సాయంతో తెలుగు పదాల్ని రాయండి. మొదటి పదం చివరి అక్షరం, రెండో పదం మొదటి అక్షరం అవుతుంది.


జత చేయండి

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. మీరు వాటిని జత చేయండి.


పట్టికల్లో సందేశం!

ఇక్కడి పట్టికలను జాగ్రత్తగా గమనిస్తే ఒక్కో పట్టికలో ఒక్క అక్షరం తప్ప మిగతావన్నీ రెండుసార్లు ఉంటాయి. ఆ ఒక్క అక్షరం ఏంటో కనిపెట్టి దాన్ని పట్టిక సంఖ్యను బట్టి కింద ఉన్న ఖాళీ గడుల్లో రాయాలి. అన్నీ సరిగ్గా రాస్తే మీకో సందేశం వస్తుంది.  


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.



నేను గీసిన చిత్రం


జవాబులు

అక్షరాల చెట్టు: ENCOURAGEMENT

అంతమే ఆరంభం: 1.మీసం, సంక్లిష్టం  2.సింహం, హంస 3.మనవి, విజేత 4.క్షీరం, రంపం 5.నీరు, రుషి 6.శ్రమ, మర 7.కలువ, వల 8.వాన, నరకం

తేడాలు కనుక్కోండి: 1.ఇంటి మెట్టు 2.కిటికీ 3.కుక్క 4.కోటు బొత్తాం 5.అమ్మాయి స్కార్ఫ్‌ 6.మేఘం

తమాషా ప్రశ్నలు: 1.గందరగోళం 2.వానరం 3.ఉపనయనం

పట్టికల్లో సందేశం: నిదానమే ప్రధానం

పొడుపు కథలు: 1.తేలు 2.సీతాఫలం 3.నీడ

జత చేయండి: 1-డి, 2-ఎఫ్‌, 3-ఎ, 4-బి, 5-సి, 6-ఇ

చెప్పుకోండి చూద్దాం: ఆ లాయరు.. పిల్లాడి తల్లి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని