కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Updated : 29 Aug 2022 06:36 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


క్విజ్‌.. క్విజ్‌.!

1. తాజాగా ట్విన్‌ టవర్స్‌ను ఏ రాష్ట్రంలో కూల్చేశారు?
2. ‘సూపర్‌ వాసుకి’ అనే పేరు దేనికి సంబంధించినది?

3. గొంగళిపురుగులు ఎలా మారతాయి?
4. సింహాల గుంపును ఏమని పిలుస్తారు?

5. పెద్ద పెద్ద గోడలు, భవంతులను ఎక్కగల సూపర్‌మ్యాన్‌ పేరేంటి?
6. అమెరికా దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది?

7. షార్క్‌ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి?
8. మిక్కీ మౌస్‌ పెంపుడు కుక్క పేరేంటి?


నేనెవర్ని?

1. రెండు అక్షరాల పదాన్ని నేను. ‘స్వర్గం’లో ఉన్నాను కానీ ‘నరకం’లో లేను. ‘వర్ణం’లో ఉన్నాను కానీ ‘వర్జ్యం’లో లేను. ఇంతకీ నేనెవర్ని?
2. నేను మూడక్షరాల పదాన్ని. ‘ఆరాటం’లో ఉన్నాను కానీ ‘పోరాటం’లో లేను. ‘పాట’లో ఉన్నాను కానీ ‘పాత’లో లేను. ‘కాలు’లో ఉన్నాను కానీ ‘కారం’లో లేను. నేను ఎవరినో చెప్పగలరా?


పొడుపు కథలు

1. కొమ్ములున్నాయి కానీ ఎద్దు కాదు. అంబారీ ఉంది కానీ ఏనుగు కాదు. మరి ఏంటది?
2. పేరులో సగం తీసేస్తే.. దాని విలువ రెట్టింపు అవుతుంది. అదేంటబ్బా?
3. గాల్లోనే ఉంటుంది. ఎంత దూరం పొమ్మంటే, అంత దగ్గరవుతుంది. ఏంటది?






జవాబులు:

అక్షరాల చెట్టు: EYEWITNESSES

తప్పులే తప్పులు: 1.పంచదార 2.గోధుమపిండి 3.ప్రపంచపటం 4.పర్వతం 5.విజయకేతనం 6.అనుమానం 7.బహుమతి 8.ప్రాంగణం

పదవలయం : 1.నదులు 2.నడక 3.నటులు 4.నలుపు 5.నరకం 6.నర్మదా 7.నలందా 8.నకలు

కవలలేవి : 3, 4

రాయగలరా?: 1.కోత 2.మేత 3.పూత 4.వాత 5.రాత 6.కూత 7.పీత 8.తాత 9.రోత 10.గీత 11.సంత 12.ముంత 13.బొంత 14.కొంత 15.పుంత 16.కాంత

నేనెవర్ని? : 1.స్వర్ణం 2.ఆటలు

క్విజ్‌.. క్విజ్‌.! : 1.ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా 2.రైలు 3.సీతాకోకచిలుకల్లా.. 4.ప్రైడ్‌ 5.స్పైడర్‌మ్యాన్‌ 6.అలస్కా 7.సున్నా 8.ప్లూటో

పొడుపు కథలు : 1.నత్త 2.అర్ధరూపాయి 3.ఊయల



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని