ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Updated : 25 Sep 2022 04:01 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


నేనెవర్ని?

1. అయిదక్షరాల పదాన్ని నేను. ‘చిలక’లో ఉన్నాను కానీ ‘పలక’లో లేను. ‘త్రయం’లో ఉన్నాను కానీ ‘ద్వయం’లో లేను. ‘లేడి’లో ఉన్నాను కానీ ‘కోడి’లో లేను. ‘ఖనిజం’లో ఉన్నాను కానీ ‘నిజం’లో లేను. ‘నంది’లో ఉన్నాను కానీ ‘కంది’లో లేను. నేను ఎవరిని?

2. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘తుమ్ము’లో ఉన్నాను కానీ ‘దుమ్ము’లో లేను. ‘దిమ్మె’లో ఉన్నాను కానీ ‘దిక్కు’లో లేను. ‘గద’లో ఉన్నాను కానీ ‘గద్ద’లో లేను. ఇంతకీ నేనెవరినో చెప్పగలరా?


తమాషా ప్రశ్నలు

1. గుర్తు చేసే కాలు?
2. ఎగిరే రాయి?
3. అందాన్నిచ్చే కారం?


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.
1. ఇనుప మేకుల్ని సైతం తిని అరిగించుకోగల జీర్ణశక్తి మొసళ్ల సొంతం.  
2. జిరాఫీలు ఎక్కువగా కూర్చొనే ఉంటాయి.

3. గోళ్లు, వెంట్రుకల మాదిరి ముక్కు కూడా జీవితాంతం పెరుగుతుంది.  
4. ‘రఫేల్‌’ విమానాలు మనుషుల ప్రయాణాలకు ఉద్దేశించినవి. 

5. పావురం ఎముకల కంటే దాని రెక్కల బరువే ఎక్కువ.
6. మనుషుల్లాగే కొన్ని జంతువులకు కూడా బట్టతల వస్తుంది.






సమాధానాలు:

అవునా.. కాదా? : 1.అవును 2.కాదు 3.కాదు 4.కాదు (యుద్ధ విమానాలు) 5.అవును 6.అవును

ఏది భిన్నం : 2

పదమాలిక!: 1.కోతి 2.కోట 3.కోల 4.కోర 5.కోత 6.కోడె 7.కోడి 8.కోటి 9.కోవా

రాయగలరా?: 1.కలబంద 2.పెరుగుపచ్చడి 3.మామిడితోరణం 4.ఉక్కపోత 5.ఉక్కుసంకల్పం 6.ఎర్రచందనం 7.గొంగళిపురుగు 8.నిమ్మకాయ 9.పావురాయి 10.అరకప్పు 11.మంచినీరు 12.ఊచకోత 13.దరహాసం 14.పాలకూర 15.పంచదార

అక్షరాల చెట్టు: MANUFACTURING

నేనెవర్ని? : 1.చిత్రలేఖనం 2.తుమ్మెద

తమాషా ప్రశ్నలు: 1.జ్ఞాపకాలు 2.పావురాయి 3.అలంకారం



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని