తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 01 Oct 2022 00:11 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


అవునా.. కాదా..?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.
1. వాల్ట్‌డిస్నీ రూపొందించిన కార్టూన్‌ పాత్ర మిక్కీ మౌస్‌ రెండు చేతులకూ నాలుగేసి వేళ్లే ఉంటాయి.
2. ఒక పురుగు పేరుతో వ్యవహరిస్తున్న ఏకైక క్రీడ వాలీబాల్‌.

3. చేపలు తమ మొప్పలతో రుచి చూడగలవు.
4. కప్ప కేవలం నీటిలో మాత్రమే జీవించగలదు.

5. జలగ తన శరీర బరువుకంటే మూడు, నాలుగు రెట్లు ఎక్కువ రక్తాన్ని పీల్చగలదు.
6. నోరు బాగా ఎండిపోయినప్పుడు, ఏం తిన్నా రుచి తెలియదు.


నేనెవర్ని?

1.  నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘దయ’లో ఉంటాను కానీ ‘లయ’లో లేను. ‘రత్నం’లో ఉంటాను కానీ ‘యత్నం’లో లేను. ‘హాస్యం’లో ఉంటాను కానీ ‘జోస్యం’లో లేను. ‘సంపద’లో ఉంటాను కానీ ‘ఆపద’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను రెండక్షరాల పదాన్ని. ‘బడి’లో ఉంటాను కానీ ‘గుడి’లో లేను. ‘పిల్ల’లో ఉంటాను.. ‘చల్ల’లోనూ ఉంటాను. నేనెవరినో చెప్పగలరా?


తమాషా ప్రశ్నలు

1. అది ఒక్కటే. కానీ, పది కాయలతో సమానం. ఏంటది?
2. వెలుగులు తీసుకొచ్చే రణం ఏమిటో?






జవాబులు:

తేడాలు కనుక్కోండి : 1.కప్ప కాలు 2.కప్ప కన్ను 3.చేప 4.కప్ప దగ్గరి ఆకు 5.రాయి 6.చేప దగ్గరి కంకి

అక్షరాల రైలు : IMPORTANT

పట్టికల్లో పదం : చార్లీచాప్లిన్‌

అవునా.. కాదా? : 1.అవును 2.కాదు (క్రికెట్‌) 3.అవును 4.కాదు (ఉభయచర జీవులు) 5.అవును 6.అవును

తప్పులే తప్పులు : 1.నటీనటులు 2.మరకతమణి 3.అస్తవ్యస్తం 4.రాజకీయాలు 5.నినాదాలు 6.మనోహరుడు 7.అత్యధికం

తమాషా ప్రశ్నలు : 1.టెంకాయ 2.కిరణం

నేనెవర్ని? : 1.దరహాసం 2.బల్ల



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని