అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 08 Feb 2023 00:38 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘అరక’లో ఉంటాను కానీ ‘మరక’లో లేను. ‘మట్టి’లో ఉంటాను కానీ ‘గట్టి’లో లేను. ‘సరి’లో ఉంటాను కానీ ‘సర్వం’లో లేను. ‘కత్తి’లో ఉంటాను కానీ ‘సుత్తి’లో లేను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా?

2. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘అంచు’లో ఉంటాను కానీ ‘మించు’లో లేను. ‘గులాబీ’లో ఉంటాను కానీ ‘జిలేబీ’లో లేను. ‘గరళం’లో ఉంటాను కానీ ‘రగడ’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పగలరా?

1. ఇటీవల భారత ప్రభుత్వం ‘వందే భారత్‌’ పేరిట సెమీ హైస్పీడ్‌ రైళ్లను ప్రారంభించింది.

2. పాములకు ఆరు జతల కాళ్లు ఉంటాయి.

3. టెన్నిస్‌ బాల్‌తో టేబుల్‌ టెన్నిస్‌ కూడా ఆడగలం.

4. అమావాస్య రోజున చంద్రుడు కనిపించడు.

5. మన దేశంలో పెట్రోల్‌ కంటే డీజిల్‌ ధర అధికం.

6. లీపు సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి.

7. ప్లాటినం కంటే వెండి చాలా విలువైన లోహం.





జవాబులు

అక్షరాల చెట్టు : ADMINISTRATOR 

నేనెవర్ని? : 1.అమరిక  2.అంగుళం

అవునా.. కాదా? : 1.అవును  2.కాదు  3.కాదు  4.అవును  5.కాదు  6.అవును  7.కాదు

పదవలయం : 1.పవనం  2.భవనం  3.సహనం  4.దహనం 5.హననం 6.పావనం 7.ఇంధనం  8.వందనం

తేడాలు కనుక్కోండి : 1.చెట్టు వెనక పొద  2.కుందేలు మూట  3.రాయి  4.సింహం  5.ఏనుగు దంతం  6.ఏనుగు కాలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని