25 కిలోల బస్తాల్లో ఇసుక

భవన నిర్మాణ వ్యర్థాల నుంచి ఇసుక, కంకరను అధునాతన యంత్రాలతో వేరు చేసి పునర్వినియోగిస్తున్నారు.

Published : 18 May 2024 00:31 IST

భవన వ్యర్థాల నుంచి తయారు చేసి పునర్వినియోగం

ఈనాడు, హైదరాబాద్‌ : భవన నిర్మాణ వ్యర్థాల నుంచి ఇసుక, కంకరను అధునాతన యంత్రాలతో వేరు చేసి పునర్వినియోగిస్తున్నారు. వీటితో కాంక్రీట్‌ బ్లాక్స్, పేవర్‌ బ్లాక్స్, ఇంట్లో గోడలకు ఉపయోగించే ఇటుకలను తయారు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీతో కలిసి సిటీలో కొన్ని సంస్థలు ఈ ప్లాంట్లను నిర్వహిస్తున్నాయి. శంషాబాద్‌లో ప్లాంట్‌ నిర్వహిస్తున్న ఎస్‌ఎస్‌ఆర్‌ఈసీ సంస్థ వ్యర్థాల నుంచి తీసిన ఇసుకను 25 కిలోల సంచుల్లో అందిస్తోంది. ఇసుకను సంచుల్లో ప్యాక్‌ చేసి ఇవ్వడం శుక్రవారం నుంచి ప్రారంభించామని నిర్వాహకులు తెలిపారు. 25 కిలోల సంచి ఉచితంగానే కావాల్సిన వారి ఇం టికి పంపిస్తున్నామని రవాణా ఛార్జీలు రూ.60 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇంట్లో యజ్ఞయాగాదులు, చిన్న మరమ్మతులు చేసుకునే వారు అవసరం లేకపోయినా టన్ను ఇసుక కొనాల్సి వస్తుంది. వీరి అవసరాల కోసం సంచుల్లో అందిస్తున్నామని తయారీదారులు అంటున్నారు.

టన్ను సగం ధరకే : మార్కెట్లో ఇసుక ధరలు మండిపోతున్నాయి. సగం ధరకే ఇసుక లభిస్తే సంతోషమే.. వ్యర్థాల నుంచి తీసిన ఇసుకను టన్ను రూ.800 విక్రయిస్తున్నామని.. మార్కెట్లో దొరికే ఇసుక ధరతో పోలిస్తే సగమే అని నిర్వాహకులు తెలిపారు. ఇసుక కావాల్సిన వారు 1800 203 0033 నంబరులో సంప్రదించవచ్చు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని