తెలంగాణ చికెన్‌ చేసేదెలా?

నాకు తెలంగాణ రెస్టారెంట్‌ స్టైల్‌ చికెన్‌ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఇంట్లో అలా కుదరడం లేదు. అందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కాస్త చెప్పండి!

Updated : 06 Aug 2023 01:22 IST

నాకు తెలంగాణ రెస్టారెంట్‌ స్టైల్‌ చికెన్‌ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఇంట్లో అలా కుదరడం లేదు. అందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కాస్త చెప్పండి!

తెలంగాణ రెస్టారెంట్‌ తరహా చికెన్‌ ఫ్రై చేయడం చాలా తేలిక. ఈ టిప్స్‌ పాటించి చూడండి.. తప్పకుండా నచ్చుతుంది, మీరంతా ఆనందిస్తారు.

  • లేత కోడి మాంసాన్నే ఎంచుకోండి. అప్పుడే మంచి రుచి వస్తుంది. వీలైతే నాటుకోడి తెస్తే మరింత బాగుంటుంది.
  • చికెన్‌ ముక్కలు మీడియం సైజ్‌లో కట్‌ చేయాలి. పెద్దగా ఉంటే ఉడకవు, చిన్నగా ఉంటే ఎక్కువ వేగుతాయి. తెలంగాణ చికెన్‌ ఫ్రై పూర్తిగా పొడిపొడిగా ఉండదు. ఇది కాస్త గుజ్జుగా సెమీ డ్రైగా ఉంటుంది.
  • మసాలా వేసిన తర్వాత చికెన్‌ త్వరగా అడుగంటుతుంది. అలా కాకూడదంటే గరిటతో మెల్లగా కలియతిప్పుతుండాలి. ఇలా చేయడం వల్ల మసాలా పరిమళాలు ముక్కలకు పట్టి రుచిగా తయారవుతుంది.
  • ఈ రెసిపీలో ఉల్లిపాయ ముక్కలు కాస్త మందంగా ఉండాలి. అవి ఎర్రగా వేగి ఉప్పు మసాలాతో కలిసి టేస్టీగా ఉంటాయి. సన్నగా తరిగితే ఎక్కువ వేగి రుచి తగ్గుతుంది.
  • చికెన్‌ ఫ్రైలో సాధారణంగా చింతపండు ఉపయోగించరు. కానీ కాస్త చింతపండు పులుసు వేస్తే ఎక్కువ రుచి వస్తుంది. ఇలా వద్దనుకున్న వారు చింతపండుకు బదులు చివర్లో కాస్త నిమ్మరసం వేసుకోవచ్చు.
  • ఈ వంటకానికి నాన్‌స్టిక్‌ పాన్లు పనికి రావు. ఎందుకంటే దీని రుచి అంతా కింది నుంచి చక్కగా వేగడంలో ఉంది. అది నాన్‌స్టిక్‌ పాన్‌లో సాధ్యం కాదు. అడుగు మందంగా ఉండే ఇనుము లేదా కాస్ట్‌ ఐరన్‌ పాత్రలు ఉపయోగించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని