Hyderabad- Brick Biryani: వారెవా ఇటుక బిర్యానీ..

దమ్‌ బిర్యానీ, బ్యాంబూ బిర్యానీ లాంటి ప్రయోగాలు మనకు తెలుసు. ఇప్పుడు కొత్తగా బ్రిక్‌ బిర్యానీ చేస్తున్నారు. ఇటుకతో తయారైన దీర్ఘచతురస్ర పాత్రలో అడుగున నెయ్యి రాసి, బిర్యానీకి అవసరమైన పదార్థాలన్నీ ఉంచి మూత పెట్టి ఉడికిస్తే.. ఘుమఘుమలాడే బ్రిక్‌ బిర్యానీ సిద్ధం.

Updated : 27 Aug 2023 12:28 IST

దమ్‌ బిర్యానీ, బ్యాంబూ బిర్యానీ లాంటి ప్రయోగాలు మనకు తెలుసు. ఇప్పుడు కొత్తగా బ్రిక్‌ బిర్యానీ చేస్తున్నారు. ఇటుకతో తయారైన దీర్ఘచతురస్ర పాత్రలో అడుగున నెయ్యి రాసి, బిర్యానీకి అవసరమైన పదార్థాలన్నీ ఉంచి మూత పెట్టి ఉడికిస్తే.. ఘుమఘుమలాడే బ్రిక్‌ బిర్యానీ సిద్ధం. ఇదెక్కడో వేరే రాష్ట్రంలో కాదండోయ్‌... హైదరాబాద్‌ కొంపల్లిలోనే చేస్తున్నారు. ఖరీదు ఎక్కువేమో అనుకుంటున్నారా?. ఉహూ.. కేవలం 189 రూపాయలే. అందరికీ అందుబాటులో ఉంది. వింటేనే నోరూరుతోంది కదూ.. ఈ ఇటుక బిర్యానీ భోజన ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. రుచి చూసిన వాళ్లంతా- సూపర్‌ రుచితో పసందుగా ఉందంటూ తెగ పొగుడుతున్నారు. అటు వెళ్తే మీరూ తిని ఆనందించండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని