గోంగూర మటన్ అదుర్స్!
మా అబ్బాయికి గోంగూర మటన్ అంటే చాలా ఇష్టం. అది చాలా రుచిగా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో చెప్పండి!
Updated : 24 Sep 2023 03:58 IST
మా అబ్బాయికి గోంగూర మటన్ అంటే చాలా ఇష్టం. అది చాలా రుచిగా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో చెప్పండి!
- లేత మాంసం ఎముకలతో ఉన్నది ఎంచుకుంటే ఎక్కువ రుచిగా ఉంటుంది. ముక్కలు మీడియం సైజు ఉండాలి. మరీ చిన్నవి అయితే కూర తయారయ్యేసరికి ఇంకా చిన్నవిగా అయిపోతాయి.
- గోంగూర మాంసానికి నూనె కాస్త ఎక్కువగానే పడుతుంది. నూనె ఉంటేనే జిగురుగా ఉండే గోంగూర నూనెలో మగ్గి రుచిగా ఉంటుంది. ఈ కూరలన్నిటికీ నూనె ఎక్కువే ఉపయోగించాలి.
- ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర అని రెండు రకాలు ఉంటాయి కదా! ఎర్రటిది కొంచెం ఎక్కువ పులుపు కనుక అది బాగుంటుంది. మీరు తెల్ల గోంగూర వాడుతున్నట్లయితే కొద్దిగా చింత పండు రసం వేస్తే పులుపు సరిపోతుంది.
- గోంగూర ఆకులు మాత్రమే వాడాలి. కాడలు వేయకండి. ఆకును కచ్చితంగా మూడు సార్లు నీళ్లలో వేసి బాగా కడగాలి. లేదంటే అందులో ఉండే ఇసుక వదలదు.
- మాంసం నిదానంగా ఉడికితేనే చాలా రుచిగా ఉంటుంది. అందుకు సుమారుగా 40 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది.
- సమయం ఎక్కువ లేదు.. వేగంగా అయిపోవాలి అనుకుంటే.. కుక్కర్లో 750 ఎం.ఎల్. నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించి.. తర్వాత మిగిలిన పద్ధతిలో చేసుకోవచ్చు.
- మటన్ జాగ్రత్తగా, తగిన విధంగా ఉడికించాలి. మరీ ఎక్కువ ఉడికితే మాంసంలోని తేమ ఆవిరై.. ముక్కలు గట్టిపడతాయి.
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Whatsapp: వాట్సప్‌లో యూజర్ నేమ్.. చాట్స్‌కు సీక్రెట్ కోడ్!
-
Pawan Kalyan: నేను ఏదైనా మాటల్లో చెప్పను.. నిలబడి చూపిస్తా: పవన్ కల్యాణ్
-
Animal: రణ్‌బీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్.. ‘యానిమల్’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే!
-
Dhulipalla Narendra: రాజకీయ లబ్ధి కోసమే జగన్ నీటి చిచ్చు పెట్టారు: ధూళిపాళ్ల నరేంద్ర
-
Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు ఈసీ అనుమతి
-
Chess: ఒకే ఇంటి నుంచి ఇద్దరు గ్రాండ్ మాస్టర్లు.. ప్రజ్ఞానంద-వైశాలి అరుదైన ఘనత