ఇడ్లీల్లోకి దోస కారం

వేరుశనగ కారం, కొబ్బరి కారం, పుట్నాల కారం, నువ్వుల కారం, ధనియాల కారం.. ఇలా ఎన్ని రకాల కారప్పొడులో కదా! మా ఇంట్లో దోస గింజలతో కారప్పొడి చేస్తాం.

Published : 27 Aug 2023 01:06 IST

వేరుశనగ కారం, కొబ్బరి కారం, పుట్నాల కారం, నువ్వుల కారం, ధనియాల కారం.. ఇలా ఎన్ని రకాల కారప్పొడులో కదా! మా ఇంట్లో దోస గింజలతో కారప్పొడి చేస్తాం. ఇది ఎంత రుచిగా ఉంటుందో అంత ఆరోగ్యం కూడా. దోసకాయ కూర వండి నప్పుడల్లా.. చేదు లేని గింజలైతే.. వాటిని ఎండబెట్టి తడి లేని డబ్బాలో దాచు కోవాలి. కారం చేయాలను కున్నప్పుడు వాటిని తీసుకుంటే సరిపోతుంది. అలా వీలవకుంటే కొనుక్కోవచ్చు కూడా. కానీ ఒక్కోసారి చేదు ఉండే అవకాశం ఉంటుంది జాగ్రత్త. ఇంతకీ దోసగింజలతో కారం ఎలా చేయాలంటే.. కడాయిలో శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, మెంతులు, ఆవాలు, దోసగింజలను సన్న సెగ మీద వేయించాలి. వాటిని ఒక పాత్రలోకి తీసి.. అదే కడాయిలో జీలకర్ర, ధనియాలు, ఎండు మిర్చి, కరివేపాకు వేయించాలి. చల్లారాక అన్నిటినీ కలిపి గ్రైండ్‌ చేయాలి. ఘుమఘుమలాడే ఈ దోస కారం గాలి చొరబడని డబ్బాలో భద్రపరచుకోవాలి. ఈ కమ్మటి కారానికి కాస్త నెయ్యి జోడించారంటే ఇడ్లీలు, దోశల్లోకి చాలా బాగుంటుంది. దోసకారం మీరూ చేసి చూడండి.. చాలా మెచ్చుకుంటారు.

 బొబ్బా ఇందిరాదేవి, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని