చేపల ఫ్రై మరింత రుచిగా..
మా పిల్లలకి ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం. కానీ ఇంట్లో చేసింది నచ్చడంలేదు. హోటల్ రుచి రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కాస్త చెప్పండి!
మా పిల్లలకి ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం. కానీ ఇంట్లో చేసింది నచ్చడంలేదు. హోటల్ రుచి రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కాస్త చెప్పండి!
చేప ఫ్రై రుచిగా చేసేందుకు ఈ సూచనలు పాటించండి..
- ముందుగా చేప ముక్కలను 20 నిమిషాలు పాలలో నానబెట్టి, తర్వాత పాలు తీసేయాలి. ఇలా చేయడం వల్ల నీచు వాసన తగ్గడమే కాకుండా అదనపు రుచి వస్తుంది.
- చేపముక్కలకు మసాలా పట్టించేటప్పుడు కొద్దిగా శనగపిండి లేదా బియ్యప్పిండిని జోడిస్తే.. ఫ్రై కరకరలాడుతుంది.
- ఉల్లిపాయల్లో తగినంత తేమ ఉంటుంది కనుక మసాలా పేస్ట్‌ను గ్రైండ్ చేసేందుకు నీళ్లు అవసరం లేదు. దానికి బదులు చెంచా నిమ్మరసం ఉపయోగించవచ్చు.
- ఉల్లి, అల్లం, వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు కలిపి ముద్దలా చేయాలి. చేపముక్కలకి ఈ మిశ్రమాన్ని పట్టించి, అరగంట ఫ్రిజ్‌లో పెట్టాలి.
- ఫిష్ ఫ్రై యథాతథంగా చేపలతో చేయొద్దు, చేపలను ముక్కలుగా కోసి చేస్తేనే బాగుం టుంది. దీనికి ఎక్కువ నూనె అవసరం లేదు.
- నూనె మరీ వేడిగా ఉంటే నానబెట్టిన చేప ముక్కలు పాత్రకు అంటుకుంటాయి. తగినంత సెగలో వేయించాలి
- ఎక్కువ మోతాదులో చేయాల్సివస్తే అన్నీ ఒకసారే వద్దు. కొన్ని కొన్ని ముక్కల చొప్పున వేయించండి. ఎక్కువ మొత్తంలో ముక్కలు వేస్తే నూనె ఎక్కువ పీల్చుకుంటుంది. పైగా ముక్కలు సరిగా వేగవు.
- చేపముక్కలను రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వహ్వా అనిపించే రుచి రావా లంటే పావుగంట పడుతుంది.
పవన్ సిరిగిరి, చెఫ్, హైదరాబాద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Nitin Gadkari : ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ మాదే కానీ..: గడ్కరీ
-
BJP: తెలంగాణకు రెండో వారంలో అమిత్‌షా.. 6న నడ్డా
-
World Culture Festival: శాంతి, సామరస్య ప్రపంచం కోసం అందరం కలిసి కృషి చేయాలి!
-
Sudheer Babu: భూతద్దంతో ఈ సినిమాని చూడొద్దు: సుధీర్ బాబు విజ్ఞప్తి
-
Delhi: ఆ ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులూ ఇంజినీర్లే.. బాంబుల తయారీలో నిష్ణాతులు