ఘాటు తక్కువ.. ఘుమాయింపు ఎక్కువ..

చికెన్‌ బటర్‌ మసాలాను హోటల్‌ స్టయిల్లో చేసేందుకు కొన్ని చిట్కాలు చెప్పండి!

Published : 05 Nov 2023 00:37 IST

చికెన్‌ బటర్‌ మసాలాను హోటల్‌ స్టయిల్లో చేసేందుకు కొన్ని చిట్కాలు చెప్పండి!

  • బటర్‌ చికెన్‌కు బోన్‌, బోన్‌లేస్‌ ఏదైనా వాడుకోవచ్చు. సంప్రదాయ పద్ధతిలో బోన్స్‌ ఉన్నదాన్ని గ్రిల్‌ చేసి వాడతారు. కానీ దీనికి బోన్లెస్‌ ఎక్కువ బాగుంటుంది.
  • చికెన్‌కు మసాలాలు పట్టించి రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువ రుచి వస్తుంది.
  • చికెన్‌ను గ్రిల్‌ చేయడానికి గ్రిల్‌ పాన్‌ వాడాలి. పాన్‌ మీద పెట్టి.. కదిలించకుండా 5 నిమిషాలు వదిలేస్తే.. ఒక వైపు చక్కగా గ్రిల్‌ అవుతుంది. తర్వాత రెండో వైపు తిప్పి 80% గ్రిల్‌ చేయాలి.
  • అవెన్లో గ్రిల్‌ చేసేట్లయితే 220 డిగ్రీల వద్ద 20 నిమిషాలు గ్రిల్‌ చేయాలి.
  • బటర్‌ చికెన్‌ కేలరీస్‌ ఉన్న రెసిపీ.. తరచూ తింటే మంచిది కాదు. అరుదుగానే కనుక.. అసలైన రుచి ఆస్వాదించాలంటే వెన్న ఎక్కువే వేయాలి.
  • ఫ్లేవర్స్‌ని బ్యాలెన్స్‌ చేయడానికి.. చివర్లో కొద్దిగా తేనె వేయాలి. తేనె నచ్చదనుకున్నా.. అందుబాటులో లేకున్నా.. పంచదార వేయొచ్చు.
  • బాగా ఘుమాయించాలంటే.. కూర దించేశాక.. ఇంకాస్త నెయ్యి వేయాలి. అలాగే కాలుతున్న బొగ్గును ఒక కప్పులో పెట్టి, దాన్ని కూర మధ్యలో ఉంచి.. గరం మసాలా చల్లి, 3 నిమిషాల తర్వాత కప్పును తీసేయాలి.
  • ఇది మామూలు మసాలా చికెన్‌ కర్రీలా ఘాటుగా ఉండదు. కారం తక్కువగా, వెన్న సువాసనతో ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని