నోరూరించే మసాలా చికెన్‌!

మనలో చికెన్‌ ప్రియులు చాలామందే ఉంటారు కదూ! మా ఇంట్లో అయితే పిల్లలూ, పెద్దలూ అందరికీ చికెన్‌ అంటే చాలా చాలా ఇష్టం. అందుకే చికెన్‌తో  వెరైటీలు చేస్తుంటాను.

Updated : 14 Apr 2024 12:20 IST

నలో చికెన్‌ ప్రియులు చాలామందే ఉంటారు కదూ! మా ఇంట్లో అయితే పిల్లలూ, పెద్దలూ అందరికీ చికెన్‌ అంటే చాలా చాలా ఇష్టం. అందుకే చికెన్‌తో  వెరైటీలు చేస్తుంటాను. వాటిల్లో ‘మసాలా చికెన్‌ కర్రీ’ మరీ మరీ బాగుంటుంది. అదెలా చేయాలంటే.. ఒక పాత్రలో కడిగిన చికెన్‌ తీసుకోవాలి. అర కిలో ముక్కలకి.. కప్పు పెరుగు, రుచికి సరిపోయేంత ఉప్పు, చెంచా కారం, చెంచా ధనియాల పొడి, అర చెంచా పసుపు, చారెడు కొత్తిమీర తరుగు, రెండు స్పూన్ల ఆవనూనె వేసి కలిపి.. ఓ గంట నానబెట్టాలి. కడాయిలో 2 చెంచాల ధనియాలు, చెంచా జీలకర్ర, 20 జీడిపప్పులు, నాలుగైదు ఎండు మిరపకాయలు, రెండు బిర్యానీ ఆకులు, కాస్త దాల్చినచెక్క, నాలుగు లవంగాలు, రెండు యాలకులు, ఒక స్టార్‌ మొగ్గ తీసుకుని.. నూనె లేకుండా డ్రైగా.. మంచి వాసన వచ్చేదాకా వేయించాలి. అవి చల్లారేలోగా.. 3 టొమాటోలు, రెండు పచ్చిమిరప కాయలు, అంగుళం అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరగాలి. వీటికి వేయించిన దినుసులు జోడించి, గ్రైండ్‌ చేయాలి. కడాయిలో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె కాగనిచ్చి.. అర చెంచా జీలకర్ర వేయాలి. అది వేగాక.. కప్పు ఉల్లి తరుగు వేసి దోరగా వేయించాలి. అందులో మ్యారినేట్‌ చేసిన చికెన్‌, అర కప్పు మెంతికూర తరుగు, గ్రైండ్‌ చేసిన మసాలా వేసి.. కలియ తిప్పి.. ఉడికించాలి. నీరంతా ఇగిరాక.. చారెడు కొత్తిమీర తరుగు వేసి దించేస్తే సరిపోతుంది. సూపర్‌ టేస్టీగా ఉండే ‘మసాలా చికెన్‌ కర్రీ’ తయారైపోతుంది.

కొల్లూరి అంజలి, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని