నత్తల్ని సాగు చేస్తారు...

ఫ్యాషన్‌ ప్రపంచానికి మారుపేరుగా చెప్పుకొనే ఫ్రాన్స్‌ ఎస్కార్‌గాట్‌ అనే వంటకానికి ప్రసిద్ధి. ఎస్కార్‌గాట్‌ అంటే మసాలాలు అద్దిన నత్తలని అర్థం..  

Published : 11 Jun 2023 00:47 IST

ఫ్యాషన్‌ ప్రపంచానికి మారుపేరుగా చెప్పుకొనే ఫ్రాన్స్‌ ఎస్కార్‌గాట్‌ అనే వంటకానికి ప్రసిద్ధి. ఎస్కార్‌గాట్‌ అంటే మసాలాలు అద్దిన నత్తలని అర్థం.. 

ఫ్రాన్స్‌ ప్రత్యేక వంటకాల్లో ఎస్కార్‌గాట్‌ ఒకటి. నత్తలకి ప్రత్యేకమైన సాస్‌లని అద్ది వీటిని తయారుచేస్తారు. మనం అతిథులొస్తే చేపలు, రొయ్యలు వడ్డించినట్టుగా వీళ్లు ఈ నత్తలు వడ్డిస్తారు. ఇందుకోసం ప్రత్యేకించి నత్తల సాగు చేస్తారు. వీటికోసం ప్రత్యేకించి తోటలు వేసి అందులో వీటిని పెంచుతారు. కొందరైతే ఎండిన ఆహారాన్ని వేసి పట్టుపరుగులు పెంచినట్టుగా పెంచుతారు. వైన్‌యార్డుల్లో పెంచే హెలిక్స్‌పొమాటియా రకం నత్తలు చాలా ప్రసిద్ధి. వంటకానికి వీటిని సిద్దం చేసేటప్పుడు... తిండి లేకుండా ఒట్టినీళ్లలోనే వారం రోజులు పాటు ఉంచుతారు. వాటిలోని వ్యర్థాలు మొత్తం తొలగిపోయాక అప్పుడు వండుతారు. ఏడాది పొడవునా సాగు చేసిన నత్తలని.. క్రిస్‌మస్‌కి పెద్ద ఎత్తున అమ్ముతారు. ఆలివ్‌ ఆయిల్‌లో వేసి ఉడికించి వివిధ రకాల సాస్‌లు వేసి నత్తలని వడ్డిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని