ఈ ఆకులో ఇన్నున్నాయా..!

బిర్యానీ.. పేరు చెబితే చాలు మన ముఖం వెలిగిపోతుంది. నోట్లో నీళ్లూరతాయి. నవాబుల హైదరాబాదీ బిర్యానీ దగ్గర్నుంచి.. కుండ బిర్యానీ వరకూ ఏదైనా సరే..

Published : 29 Oct 2023 00:50 IST

బిర్యానీ.. పేరు చెబితే చాలు మన ముఖం వెలిగిపోతుంది. నోట్లో నీళ్లూరతాయి. నవాబుల హైదరాబాదీ బిర్యానీ దగ్గర్నుంచి.. కుండ బిర్యానీ వరకూ ఏదైనా సరే.. ఎప్పుడెప్పుడు తిందామా అన్నంత ఊరిస్తుంది. ఆ ఘుమఘుమలకు అసలైన కారణం బిర్యానీ ఆకు. ఇది పేరుకు బిర్యానీ ఆకే అయినా..  కిచిడీ, ఫ్రైడ్‌ రైస్‌, మసాలా కూరల్లోనూ వేసి.. వాటి రుచి మరింత పెరిగేలా చేస్తాం. ఇది సువాసనలు గుప్పించడమే కాదండోయ్‌.. ఇందులో బోలెడన్ని ఔషధ గుణాలూ ఉన్నాయి. మొట్టమొదట ఆ సువాసన.. నోట్లో ద్రవాలు ఊరించి, తినాలనిపించేలా చేస్తుంది. ఇది జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఆకలిని పెంచుతుంది. మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శ్వాసకోశ సమస్యలను, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను, క్యాన్సర్లను నివారిస్తుంది. సూక్ష్మక్రిములను నశింపచేస్తుంది. జుట్టు పెరిగేందుకు తోడ్పడుతుంది. గుండె, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్‌ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నొప్పి, వాపు, మంటలు తగ్గుతాయి. బిర్యానీ ఆకులో ఎన్ని సుగుణాలో కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని