కేకులో కాయిన్‌ వస్తే...

స్పెయిన్‌లో కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్నప్పుడు సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు ద్రాక్ష పండ్లని ఒకదాని తర్వాత ఒకటి.. ఒక్కోనెలకి గుర్తుగా ఒక్కోటి తింటారు.

Updated : 01 Jan 2023 06:45 IST

స్పెయిన్‌లో కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్నప్పుడు సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు ద్రాక్ష పండ్లని ఒకదాని తర్వాత ఒకటి.. ఒక్కోనెలకి గుర్తుగా ఒక్కోటి తింటారు. పండ్లు తియ్యగా ఉంటే ఆ నెలలు బాగుంటాయని.. పుల్లగా ఉంటే కష్టాలుంటాయని నమ్ముతారు. 

* టర్కీలో కొత్త సంవత్సరం దానిమ్మలని సౌభాగ్యానికి గుర్తుగా తింటారు. జపాన్‌లో బక్వీట్‌తో చేసిన పొడవాటి నూడుల్స్‌ చేసుకుని తింటారు. వాటిని ఎక్కడా తెంపకుండా... పూర్తిగా నోటితో పీల్చుకుని తింటారు. దాన్ని వాళ్లు దీర్గాయుష్షుకు చిహ్నంగా భావిస్తారు. గ్రీక్‌ ప్రజలు వాసిలోపిటా అనే బాదం, కాఫీతో చేసిన కేక్‌ని తింటారు. అలా తిన్నవారికి ఎవరికైనా నాణెం తగిలితే ఆ కొత్త సంవత్సరంలో వాళ్లని అదృష్టం వరిస్తుందని నమ్ముతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని