ఇవన్నీ బిస్కెట్లే!

జంతికలూ, బూందీ అందరికీ నచ్చకపోవచ్చు. కొబ్బరిబూరెలూ, అరిసెలూ తినకూడని వాళ్లుండొచ్చు. కానీ బిస్కెట్లు అలా కాదు. ఎవరికైనా నచ్చేస్తాయి. ఏ పిండివంటలు ఉన్నా లేకున్నా మనందరి ఇళ్లల్లో బిస్కెట్‌ ప్యాకెట్లు తప్పనిసరిగా ఉంటాయి.

Updated : 23 Jul 2023 02:08 IST

జంతికలూ, బూందీ అందరికీ నచ్చకపోవచ్చు. కొబ్బరిబూరెలూ, అరిసెలూ తినకూడని వాళ్లుండొచ్చు. కానీ బిస్కెట్లు అలా కాదు. ఎవరికైనా నచ్చేస్తాయి. ఏ పిండివంటలు ఉన్నా లేకున్నా మనందరి ఇళ్లల్లో బిస్కెట్‌ ప్యాకెట్లు తప్పనిసరిగా ఉంటాయి. భోజనం ఆలస్యమయ్యేట్లుంటే అవే మనకు తక్షణ ఆహారం. చాయ్‌లో ముంచుకుని తింటాం. ఉత్తినే కాలక్షేపానికీ ఆరగిస్తాం. ఒక్కోసారి ఇవే మన స్నాక్స్‌. వాటిల్లో అసంఖ్యాక రుచులూ ఆకృతులూ ఉన్నాయి. బిస్కెట్లు ఇష్టంగా తింటూనే వాటితో కుర్చీలూ బల్లలూ చేసి ఆనందిస్తున్నారు చిచ్చరపిడుగులు. ఎంత కళాహృదయం కదూ! మీ చిన్నారుల్నీ ఒకసారి ప్రయత్నించి చూడమనండి!

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని