కేక పెట్టించిన కేక్‌ చీర!

పెళ్లంటేనే ఒక అద్భుతం. పెళ్లికి ముందు, తర్వాత కూడా బోలెడన్ని ఆచారాలూ, ఆర్భాటాలూ ఉంటాయి. రంగురంగుల పట్టు వస్త్రాలు, ఆహా అనిపించే విందు భోజనాలతో కనువిందుగా, కోలాహలంగా ఉంటుంది.

Published : 10 Sep 2023 00:31 IST

పెళ్లంటేనే ఒక అద్భుతం. పెళ్లికి ముందు, తర్వాత కూడా బోలెడన్ని ఆచారాలూ, ఆర్భాటాలూ ఉంటాయి. రంగురంగుల పట్టు వస్త్రాలు, ఆహా అనిపించే విందు భోజనాలతో కనువిందుగా, కోలాహలంగా ఉంటుంది. ఆ వైభవానికి ఇంకాస్త కళాత్మకత జోడించాలనుకున్నారు అబ్బాయి తరపువారు.  కోనసీమ జిల్లా అమలాపురంలో ఒక నిశ్చయార్థం వేడుకలో మగపెళ్లివారు వధువుకు అచ్చం పట్టుచీర లాంటి కేక్‌తో స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఎరుపు, జరీ బోర్డరుతో ఆకుపచ్చ చీర భేషుగ్గా ఉందనుకుంటే.. దాని మీద అదనపు హంగులుగా జాకెటు ముక్క, తాంబూలం, గాజులు, గొలుసు, పసుపు, కుంకుమ భరిణెలు-  టాపింగ్‌తో అబ్బురపరిచేలా ఉంది. అచ్చం పట్టుచీరను పొలిన కేకు అందర్నీ ఆకట్టుకుంది. ‘చక్కటి మధుర జ్ఞాపకంగా, మనసులో నిలిచిపోయేలా ఉంది’ అంటూ అమ్మాయి తరపువారు సంబరపడిపోతున్నారు. ఈ వార్త వైరల్‌ అయి పాఠకలోకాన్ని కూడా అలరించింది. అమలాపురం వైష్ణవి స్వీట్స్‌ దుకాణంలో ఈ కేకు తయారైంది. నచ్చితే.. మీరూ ఇలాంటిది ప్రయత్నించండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని