Andhra News: జనసేన సభ వారందరికీ అంకితం: మనోహర్‌

కరోనా వేళ జన సైనికులు అనేక ప్రాంతాల్లో అందించిన సేవా కార్యక్రమాలు అపూర్వమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కొనియాడారు. కొవిడ్‌

Updated : 14 Mar 2022 19:55 IST

తాడేపల్లి: కరోనా వేళ జన సైనికులు అనేక ప్రాంతాల్లో అందించిన సేవా కార్యక్రమాలు అపూర్వమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కొనియాడారు. కొవిడ్‌ మహమ్మారితో మృతిచెందిన వారికి సభా వేదిక నుంచి సంతాపం ప్రకటించారు. రోడ్డు ప్రమాదాల్లో, అనారోగ్యం వల్ల, ప్రజాసేవలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ సభను అంకితం చేస్తున్నట్టు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు అండగా నిలబడతామన్నారు. జనసేన తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవ సభ తాడేపల్లి మండలంలోని ఇప్పటంలో నిర్వహించారు. దామోదరం సంజీవయ్య వేదికగా నామరణం చేసిన ఈ సభా వేదికపై పలువురు నేతలు ప్రసంగిస్తున్నారు. 

ఈ సందర్భంగా ఆ పార్టీ నేత హరిప్రసాద్‌ మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాల్ని మార్చే సామర్థ్యం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కే ఉందన్నారు. రాష్ట్రంలో ల్యాండ్‌, శాండ్‌ మాఫియా రాజ్యమేలుతోందనీ.. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించడం పవన్‌ వల్లే సాధ్యమన్నారు. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధనకు జనసేన కృషిచేస్తోందని చెప్పారు. ఈ ఆవిర్భావ సభకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఆ పార్టీ నేతలు నాగబాబు, నాదెండ్ల మనోహర్‌ తదితరులు హాజరయ్యారు. పార్టీ శ్రేణులు, పవన్‌ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సభలో పవన్‌ కల్యాణ్‌ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని