అసంపూర్తి పనులు.. విద్యార్థుల అవస్థలు..!

కృష్ణా జిల్లా రెడ్డిగూడెంలోని జడ్పీ ఉన్నత పాఠశాల దుస్థితి ఇది. ఈ తరగతి గదుల్లోనే విద్యార్థులు చదువుకోవాల్సి వస్తోంది. ఈ పాఠశాలను బాగు చేసేందుకు 2020లో మనబడి నాడు-నేడు కార్యక్రమం మొదటి

Published : 29 Nov 2021 03:56 IST

మరమ్మతులకు గురైన బెంచీలపై కూర్చున్న విద్యార్థినులు

కృష్ణా జిల్లా రెడ్డిగూడెంలోని జడ్పీ ఉన్నత పాఠశాల దుస్థితి ఇది. ఈ తరగతి గదుల్లోనే విద్యార్థులు చదువుకోవాల్సి వస్తోంది. ఈ పాఠశాలను బాగు చేసేందుకు 2020లో మనబడి నాడు-నేడు కార్యక్రమం మొదటి దశలో నాబార్డు నుంచి రూ.69.6లక్షలు మంజూరయ్యాయి. గుత్తేదారు పనులు మొదలుపెట్టారు. తలుపులు, కిటికీలు, బల్లలను తీసేశారు. బిల్లులు మంజూరు కాకపోవడంతో పనులు ఆపేశారు. వానొస్తే నీరంతా లోపలికి వస్తోంది. పాములు, విష పురుగులు లోపలికి వస్తున్నాయి. పదో తరగతి పిల్లలు కింద కూర్చోవడం చూడలేక ఉపాధ్యాయులే రూ.70వేలు సొంతంగా ఖర్చుపెట్టి బెంచీలను బాగు చేయించారు. నాబార్డు నుంచి నిధులను తెప్పించి పనులను పూర్తి చేయడానికి ఉన్నతాధికారులు హామీ ఇచ్చారని ప్రధానోపాధ్యాయుడు చెబుతున్నారు.

అసంపూర్తిగా ఉన్న గదిలోనే తరగతులు

- ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని