మధ్యాహ్న భోజనానికి బదులు ఇడ్లీ, సాంబారు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకం మెనూలో విద్యాశాఖ మార్పులకు ప్రయత్నిస్తోంది. వారంలో గురువారం ఇడ్లీ, సాంబారు ఇవ్వాలని సంకల్పించింది. రాష్ట్రంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది.

Published : 21 Jan 2022 05:36 IST

గురువారం మెనూలో మార్పు

తాడేపల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకం మెనూలో విద్యాశాఖ మార్పులకు ప్రయత్నిస్తోంది. వారంలో గురువారం ఇడ్లీ, సాంబారు ఇవ్వాలని సంకల్పించింది. రాష్ట్రంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. మండలంలోని చిర్రావూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో నూతన మెనూ ప్రకారం గురువారం మధ్యాహ్నం ఇడ్లీ, సాంబారు వడ్డించారు. మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి నాలుగు ఇడ్లీలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 5ఇడ్లీలు ఇవ్వనున్నట్లు మధ్యాహ్న భోజన పథకం జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు చెప్పారు. పాత మెనూ ప్రకారం ప్రతి గురువారం కిచిడీ, టమాట చట్నీ, ఉడికించిన గుడ్డు అందజేసేవారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని